RBI Quiz: ఆర్‌బీఐ క్విజ్.. రూ. 10 లక్షలు గెలుచుకునే అవకాశం

అనంతపురం అర్బన్: ఆర్బీఐ క్విజ్ పోటీల్లో పాల్గొనాలని డిగ్రీ కళాశాలల విద్యార్థులకు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. ఇందుకు సం బంధించిన పోస్టర్లను ఆగ‌స్టు 27న‌ తన చాంబర్ లొ ఎల్డీఎం నరసింగరావుతో కలసి ఆయన విడుదల చేసి, మాట్లాడారు.

ఆర్బీఐ 90 వసం పూర్తి చేసుకున్న సందర్భంగా యూజీ స్థాయిలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించ సున్నారన్నారు. విద్యార్థుల్లో రిజర్వుబ్యాంక్, ఆర్థిక పర్యావరణ వ్యవస్థపై అవగాహన కల్పించేలా సెప్టెంబరులో పోటీలు ఉంటాయన్నారు.

చదవండి: RBI: 'గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌'.. ఎకానమీ పటిష్టతే ఆర్‌బీఐ లక్ష్యం

ఎల్డీఎం మాట్లాడుతూ ఆర్బీఐ క్విజ్ సాధారణ పరి జ్ఞానం ఆధారితంగా సాగుతుందన్నారు. జిల్లాలోని నాలుగు విశ్వ విద్యాలయాలు, 149 కళాశాలలు, 50 స్టాండ్ అలోన్ కళాశాలల విద్యార్థులందరూ క్విజ్లో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి ఉన్నవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

బహుమతులు ఇలా...

స్థాయి

ప్రథమ

ద్వితీయ

తృతీయ

రాష్ట్ర

రూ.2 లక్షలు

రూ.1.50 లక్షలు

రూ.1 లక్ష

జోనల్

రూ.5 లక్షలు

రూ.4 లక్షలు

రూ.3 లక్షలు

జాతీయ

రూ.10 లక్షలు

రూ.8 లక్షలు

రూ.6 లక్షలు

#Tags