Govt Jobs: క్రీడాకారులకు సర్కారీ ఉద్యోగాలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిభా వంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి వీలుగా తెలంగాణ(పబ్లిక్‌ సర్వీస్‌ నియామ కాల క్రమబద్ధీకరణ, సిబ్బంది, వేతనాల హేతుబద్ధీకరణ) చట్ట సవరణ బిల్లును ఆగ‌స్టు 2న‌ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, కాలేజీ సర్వీస్‌ కమిషన్, ఏదైనా కమిటీ, ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సే్ఛంజీ, పత్రికల్లో బహిరంగ ప్రకటనల ద్వారా మినహా ఇతర పద్ధతుల్లో ఉద్యోగాల భర్తీపై ఈ చట్టం ద్వారా నిషేధం విధించారు.
కారుణ్య నియామకాలతో పాటు పోలీసు కాల్పులు/ బాంబు పేలుళ్లు/ తీవ్రవాదుల హింస బాధితులు, అత్యాచారాలకు గురైన ఎస్సీ, ఎస్టీల విషయంలో మినహాయింపు ఉంది. ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ నిఖత్‌ జరీన్, అంతర్జాతీయ క్రికెటర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇకపై క్రీడాకారులకు సైతం ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా ఈ చట్టానికి ప్రభుత్వం సవరణలను ప్రతిపాదించింది. 

చదవండి: Manu Bhakar: ఏ భారత ప్లేయర్‌కు సాధ్యంకాని రికార్డును సాధించేందుకు మనూ భాకర్‌ ‘సై’..!
మరో రెండు బిల్లులకు ఆమోదం..: జూనియర్‌ సివిల్‌ జడ్జీల ద్రవ్య అధికార పరిధిని రూ.20 లక్షల నుంచి రూ.10 లక్షలకు కుదించడానికి ప్రతిపాదించిన తెలంగాణ సివిల్‌ కోర్టు చట్ట సవరణ బిల్లుతో పాటు తెలంగాణ సంక్షిప్తనామాన్ని ‘టీఎస్‌’నుంచి ‘టీజీ’కి మార్చుతూ ప్రతిపాదించిన కొత్త చట్టం బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 

#Tags