Dr Sandeep Singh Selling Vegetables : నాలుగు మాస్టర్‌ డిగ్రీలు.. ఒక పీహెచ్‌డీ చేశా.. ఇందుకే రోడ్ల‌పై కూరగాయలు అమ్ముతున్నా..

ఎంత మంచి ఉన్నత చదువులు చదివినా అందుకు తగ్గ స్థాయిలో ఉద్యోగాల లేకపోవడంతో ఎంతో మంది ఎదో ఒక ఉద్యోగంతో జీవ‌నంను సాగిస్తుంటారు. స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందిన డాక్టర్‌ సందీప్‌ సింగ్ రోడ్ల‌పై కూరగాయలు అమ్ముతూ.. బ‌తుకు బండిని లాకుతున్నాడు.

పూర్తి వివరాల్లోకెళ్తే.. పంజాబ్‌లోని పాటియాలకు చెందిన 39 ఏళ్ల డాక్టర్‌ సందీప్‌ సింగ్‌ పీహెచ్‌డీ, నాలుగు మాస్టర్‌ డిగ్రీలు చేసిన ఉన్నత విద్యావంతుడు. ఆయన గత 11 ఏళ్లుగా పంజాబీ యూనివర్సిటీ న్యాయ విభాగంలో కాంట్రాక్టు ప్రోఫెసర్‌గా పనిచేశారు. 

కూరగాయాల బండిపై పీహెచ్‌డీ సబ్జీవాలా అనే బోర్డు పెట్టుకుని..
కానీ అక్కడ ఇచ్చే అరకొర జీతం అక్కరకు రాక నానాపాట్లు పడ్డాడు. పైగా వేతనం కూడా సకాలంలో రాకపోవడం వంటి సమస్యలతో విసుగు చెంది బతుకుదెరువు కోసం కూరగాయాలు అమ్మడం ప్రారంభించారు. ఆయన న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన వ్యక్తి. అంతేగాదు జర్నలిజం, పొలిటికల్‌ సైన్సు వంటి సబ్జెక్టుల్లో మాస్టర్‌ డిగ్రీలు చేసిన వ్యక్తి.  సందీప్‌ సింగ్‌ మాట్లాడుతూ.. సమాయానికి జీతం రాకపోవడం, ఒకవేళ వచ్చినా.. ఆ అరకొర జీతంతో తాను తన కుటుంబం బతకడం కష్టంగా మారడంతో కూరగాయాలు అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయన తన కూరగాయాల బండిపై పీహెచ్‌డీ సబ్జీవాలా అనే బోర్డు పెట్టుకుని మరీ ఇంటి ఇంటికి తిరుగుతూ కూరగాయాలు అమ్ముతుంటాడు. అయితే తాను ప్రొఫెసర్‌గా సంపాదించిన దానికంటే కూరగాయాలు అమ్మడం ద్వారానే ఎక్కువ ఆర్జిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

 Success Story : ఊహించని విజ‌యం.. ఆఫీసు బాయ్ నుంచి రెండు కంపెనీలకు సీఈవో స్థాయికి వ‌చ్చానిలా.. కానీ..

ప్రొఫెసర్‌ వృత్తికి బ్రేక్‌ ఇచ్చినప్పటికీ..


ఒక పక్కన ఇలా కూరగాయాలు అమ్ముతూనే చదువు కొనసాగిస్తున్నాడు సందీప్‌ సింగ్‌. అంతేగాదు తాను తన ప్రొఫెసర్‌ వృత్తికి బ్రేక్‌ ఇచ్చినప్పటికీ ఎప్పటికీ తన ఈ ప్రోఫెసర్‌ వృత్తిని వదలనని ఇది తనకు ఇష్టమని చెబుతున్నాడు. పైగా డబ్బు ఆదా చేసి, ఎప్పటికైనా సొంతంగా ఓ ట్యూషన్‌ సెంటర్‌ని స్టార్ట్‌ చేయాలన్నది తన కోరిక అని చెప్పాడు. ఈ ఉన్నత విద్యావంతుడి కోరక నెరవెరాలని ఆశిద్దాం. ఇలాంటి ఘటనలు మన దేశంలో ఉన్న నిరుద్యోగతకు అద్దం పడుతోంది కదా!. కొంగొత్త కోర్సులు వస్తున్నట్లే అంతే స్థాయిలో ఉద్యోగాలు ఉంటే ఇలా సందీప్‌ లాంటి వాళ్లకు కూరగాయాలమ్మే పరిస్థితి ఏర్పడదు కదా!. 

కూరగాయలు అమ్మటం వల్లనే ఎక్కువగా డబ్బులు..

ఇన్నేళ్లపాటు కాంట్రాక్టు ఉద్యోగం చేసిన సందీప్‌ నెలవారి జీతాల విషయంలో చాలా ఇబ్బందుల ఎదుర్కొన్నారు. జీతాల తగ్గింపు, సరైన సమయానికి సాలరీ రాకపోవటం వంటివి ఆయన్ను తీవ్రంగా వెంటాడాయి. చేసేదేంలేక కూరగాయల అమ్మకాన్ని మొదలుపెట్టారు డా. సందీప్‌. తాను ఇల్లూ ఇల్లు తిరిగి కూరగాయలు అమ్మె బండికి వినూత్నంగా ‘పిహెచ్‌డీ సబ్జీవాలా’ అని పేరు పెట్టుకున్నారు.

 Success Story : చ‌దువులో ఫెయిల‌య్యా.. కానీ రూ.1,843 కోట్లు సంపాదించానిలా.. ఎలా అంటే..?

పంజాబ్‌లోని పాటియాలకు చెందిన సందీప్‌.. ఉద్యోగం కంటే కూడా కూరగాయలు అమ్మటం వల్లనే తాను ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పటం గమనార్హం. మరోవైపు తాను మరో మాస్టర్‌ డిగ్రీ కోసం చదువకుంటూ.. కూరగాలయలు అమ్మగా వచ్చిన మొత్తంతో టీచింగ్‌ వృత్తిని మానుకోకుండా పిల్లలకు ట్యూషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు.

#Tags