Constable Jobs: 39,481 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఉచితంగా శిక్షణ

డుంబ్రిగుడ/అరకులోయ రూరల్‌/మారేడుమిల్లి: ఎస్‌ఎస్‌సీ జీడీ కాసిస్టేబుల్‌ రిక్యూర్‌మెంట్‌లో భాగంగా సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌ఫీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఏఆర్‌, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ పలు విభాగాల్లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైయిందని, ఈ అవకాశాన్ని అర్హులైన గిరిజన, యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని అరకులోయ, మారేడుమిల్లి సీఐలు హిమగిరి, గోపాలకృష్ణ, డుంబ్రిగుడ ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌లు తెలిపారు.

Samantha 10th Class Marks sheet: సమంత ఏం చదువుకుందో తెలుసా? నటనలోనే కాదు, చదువులోనూ టాపర్‌!

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉచిత శిక్షణను కల్పిస్తున్నట్లు తెలిపారు. పదో తరగతి అర్హతతో నిర్వహించే ఆద్యోగాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పురుషులకు 162.5 సెంటిమీటర్లు ఎత్తు, సీ్త్రలకు 150 సెంటిమీటర్లు ఎత్తులో ఉన్న వారు వచ్చే నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Bank Jobs 2024: ఇండియా ఎగ్జిమ్‌ బ్యాంక్‌లో నెలకు రూ. 65వేల వేతనం.. అప్లై చేశారా?

18 నుంచి 23 సంవత్సరాలు వయస్సు కలిగిన వారు మాత్రమే అర్హులన్నారు. ఎస్టీ, ఎస్సీలకు ఐదు సంవత్సరాలు మినహాయింపు ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఈ నెల 27 తేది వరకు ఉంటుందన్నారు. ఐటీడీఏ, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన వారికి ఉచిత శిక్షణ, వసతి భోజనం కల్పిస్తున్నామని పూర్తి వివరాలకు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

#Tags