SSC Translator Jobs: ట్రాన్స్‌లేషన్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు లక్షకుపై పైగా వేతనం

Government of India Translator Positions SSC JHT, JTO & SHT Recruitment 2024

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 312 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 312
ఖాళీల వివరాలు

  • జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌ (JHT)
  • జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్ (JTO)
  • జూనియర్ ట్రాన్స్‌లేటర్‌ (JT)
  • సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌ (SHT)
  • సీనియర్ ట్రాన్స్‌లేటర్‌ (ST)

Exams In August Month 2024: ఆగస్టు నెలలో జరిగే పరీక్షల షెడ్యూల్‌ విడుదల

అర్హత: పోస్టును అనుసరించి మాస్టర్‌ డిగ్రీ(హిందీ/ఇంగ్లిష్‌) డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్‌ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. దీనితోపాటు ట్రాన్స్‌లేషన్‌ (హిందీ/ఇంగ్లిష్‌) డిప్లొమా/సర్టిఫికేట్‌ కోర్సు చేసి ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలో రెండేళ్ల ట్రాన్స్‌లేషన్‌ అనుభవం ఉండాలి. సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీతోపాటు మూడేళ్ల ట్రాన్స్‌లేషన్‌ అనుభవం ఉండాలి. బ్యాచిలర్‌ డిగ్రీ/పీజీ(హిందీ/ఇంగ్లిష్‌) అర్హతతోపాటు తగు అనుభవం ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్‌ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీనియర్‌ సెకండరీ స్థాయిలో రెండేళ్ల హిందీ బోధన అనుభవం ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి
వేతనం: నెలకు సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్/ సీనియర్ ట్రాన్స్ లేటర్ పోస్టులకు రూ. 44900-142400, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్/ జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ కు రూ. 35400-112400, జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ కు రూ. 35400- 112400, జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ కు రూ. 35400-112400.

ఎంపిక విధానం: రాతపరీక్ష(పేపర్‌–1, పేపర్‌–2), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపికచేస్తారు.

IOCL Apprentices Notification: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో 400 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌


ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 25

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-1): అక్టోబర్/ నవంబర్‌, 2024.
వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

#Tags