SSC MTS Notification 2024: పదో తరగతి పాసైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 8326 పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. పదో తరగతి అర్హతతో 8,326 పోస్టులకు ఎస్‌ఎస్‌సి (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 8,326 పోస్టుల్లో 4,887 ఎమ్‌టిఎస్ పోస్టులు కాగా, 3,439 హవాల్దార్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 8326
ఖాళీల వివరాలు
మల్టీ టాస్కింగ్ (నాన్- టెక్నికల్): 4887 పోస్టులు
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత
వయస్సు: 25 ఏళ్లకు మించరాదు.
హవాల్దార్: 3439 పోస్టులు
వయస్సు: 27 ఏళ్లకు మించరాదు
పరీక్ష విధానం: సీబీటీ(computer based examination) విధానంలో ఉంటుంది.
National Fire Service College: ఫైర్ ఇంజనీరింగ్‌తో ఉద్యోగావకాశాలు.. ఈ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు
అప్లికేషన్ ఫీజు: రూ. 100/- (ఎస్టీ/ఎస్సీ/మహిళలు, వికలాంగులకు ఎలాంటి ఫీజు లేదు)
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: జులై 31, 2024
పరక్ష తేది: అక్టోబర్- నవంబర్ 2024