SSC JE Paper I Results Declared: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ పేపర్-1 ఫలితాలు విడుదల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ssc) 1765 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పేపర్-1 పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ పేరు,రూల్‌నెంబర్ వివరాలను నమోదు చేసి ssc.gov.in వెబ్‌ససైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చు.
పేపర్-1లో మొత్తం 16,223 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. దీంతో వీరు పేపర్-2 పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. ఈ పరీక్ష తర్వాత ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
POWERGRID Apprenticeship Recruitment: పవర్‌గ్రిడ్‌లో వెయ్యికి పైగా ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల
కాగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో 1765 జూనియర్ ఇంజనీర్ (SSC JE) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
SSC JE Paper I Result.. ఇలా చెక్ చేసుకోండి
- ముందుగా SSC వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి
- హోంపేజీలో కనిపిస్తున్న"SSC JE Paper I Result 2024"అనే లింక్‌ను క్లిక్ చేయండి
- షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితా కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి