Work From Home: నీటి సంక్షోభం కార‌ణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు డిమాండ్! ఎక్క‌డంటే?

ఐటీ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న బెంగళూరులో నీటి సంక్షోభం తలెత్తింది.

నగరంలో నీటి కష్టాలపై స్థానికులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. నగరవాసులు, సామాజిక సంఘాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ట్యాగ్‌ చేస్తూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అభ్యర్థనలను హోరెత్తిస్తున్నారు.

నగరంలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాన్ని కల్పించేలా చూడాలని, పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను పునఃప్రారంభించడానికి అనుమతించాలని వారు సీఎంను కోరుతున్నారు. కోవిడ్‌  మహమ్మారి సమయంలో ఉపయోగపడిన ఈ వ్యూహాన్ని ప్రస్తుత నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి  ఎందుకు ఉపయోగించకూడదు అని ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల అందరికీ ప్రయోజనం కలుగుతుందని, మండుతున్న ఎండల నుండి ఉద్యోగులకు, విద్యార్థులకు ఉపశమనం కలగడమే కాకుండా విలువైన సంక్షోభ సమయంలో నీటి సంరక్షణకు దోహదపడుతుందని వాదిస్తున్నారు.  

Software Employees: ఇష్టంలేని పని ఎన్ని రోజులు చేస్తారు.. రాజీనామా చేయండి!!

దీంతో తగ్గనున్న నగరం ఒత్తిడి..

'బెంగళూరు నగరంలో పెరిగిన ఎండ వేడి, తీవ్రమైన నీటి సంక్షోభం నెలకొని ఉండటం, ఈ నెలలో పెద్దగా వర్షాలు లేనందున వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను కర్ణాటక ప్రభుత్వం పరిగణించాల్సిన సమయం ఆసన్నమైంది' అని ‘గో బై కర్ణాటక వెదర్’ (@Bnglrweatherman) అనే వాతావరణ ఔత్సాహికుల బృందం ‘ఎక్స్‌’లో పేర్కొంది.

'నీటి సంక్షోభం.. ఆన్‌లైన్ తరగతులు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉంటాయా? విద్యార్థులు, ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతిస్తే, చాలా మంది వారి స్వస్థలాలకు వెళతారు. నగరంపై ఒత్తిడి తగ్గుతుంది!' అని సిటిజన్స్ ఎజెండా ఫర్‌ బెంగళూరు (@BengaluruAgenda) రాసుకొచ్చింది.

IT Sector: ఐటీ కారిడార్‌లో హైబ్రిడ్‌ మోడల్‌.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌పై కంపెనీల తీరు ఇదే!!

ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించడం వల్ల చాలా మంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లే దృష్టాంతం ఏర్పడవచ్చని మరికొంత హైలైట్ చేశారు. దీని వల్ల పట్టణ ప్రాంతాల్లో నీటి డిమాండ్ తగ్గడానికి దారితీయవచ్చు అంటున్నారు.

ముఖ్యంగా ఐటీ రంగానికి ఇంటి నుండి పని కోసం ఆదేశాన్ని అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరుతూ నమ్మ వైట్‌ఫీల్డ్ అని పిలిచే నగరంలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని నివాసితులు, నివాస సంక్షేమ సంఘాల సమాఖ్య ‘ఎక్స్‌’లో పోస్ట్ చేసింది. ఇటువంటి చర్య ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలు కల్పిస్తుందని, తద్వారా బెంగళూరుపై భారం తగ్గుతుందని పేర్కొంది.

IT Jobs: భారీ షాక్‌.. 70 శాతం పోనున్న ఐటీ ఉద్యోగాలు!!

WFH వల్ల కలిగే ప్రయోజనాలు..

  • నీటి డిమాండ్‌ తగ్గుతుంది.
  • ఉద్యోగులు, విద్యార్థులకు ఎండ నుండి ఉపశమనం.
  • బెంగళూరులో ట్రాఫిక్‌ తగ్గుతుంది.
  • ఐటీ ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లి, నగరంపై భారం తగ్గుతుంది.

#Tags