AI skills: ఏఐ స్కిల్స్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు ట్రైనింగ్.. ఎక్క‌డంటే..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో.. AIలో నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 3.5 లక్షల మంది ఉద్యోగులకు AIలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టీసీఎస్ దాదాపు 3.5 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇప్పించినట్లు తాజాగా వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీలో ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చిన కంపెనీల జాబితాలో టీసీఎస్ ముందు వరుసలో నిలిచింది.

టీసీఎస్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో 1.5 లక్షల మందికి ఏఐలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. ఆ తరువాత కూడా ఇంకొంతమందికి ట్రైనింగ్ ఇచ్చింది. మొత్తం మీద కంపెనీ ఇప్పటి వరకు ఏకంగా 3.5 లక్షల మందికి ఏఐ విభాగంలో ప్రాథమిక నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది.

Artificial Intelligence: భవిష్యత్తు అంతా ఏఐ మయమే.. జీ20 నిర్వహణతో ప్రపంచ గుర్తింపు!!

ఏఐలో శిక్షణ పొందిన వారిలో.. సగం కంటే ఎక్కువ మంది కంపెనీకి చెందిన వారు ఈ టెక్నాలజీలో నైపుణ్యం సాధించినట్లు టీసీఎస్ పేర్కొంది. క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కస్టమర్ అవసరాలకు దృష్టిలో ఉంచుకుని ఆయా విభాగాలలోని ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేసిన ఘనత కూడా టీసీఎస్ సొంతం కావడం గమనార్హం. రాబోయే రోజుల్లో కంపెనీ మరింత మంది ఉద్యోగులకు ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది.

#Tags