Layoffs In IT Sector: ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం..భారీగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ

2024లో కూడా ఐటీ ఉద్యోగుల పరిస్థితి గాల్లో దీపంలాగా అయిపోయింది. కరోనా సమయంలో ఉద్యోగాలు పోయి ఇబ్బందులు పడిన సంఘటనలు మరువకముందే.. దిగ్గజ కంపెనీలు సైతం ఇప్పటికే అదే బాటలో నడుస్తున్నాయి. ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. తాజాగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ 'కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్' ఏప్రిల్ - జూన్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఇందులో ఏకంగా 8వేలకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు స్పష్టమవుతోంది.

అమెరికా ప్రధాన కేంద్రంగా పనిచేసే కాగ్నిజెంట్ సంస్థలో ఎక్కువమంది భారతీయ ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీ జూన్ 2024తో ముగిసిన రెండవ త్రైమాసికంలో 566 మిలియన్ డాలర్ల నికర లాభం పొందింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే సుమారు 22.2 శాతం ఎక్కువని తెలుస్తోంది.

ECIL Hyderabad Recruitment: ఈసీఐఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని లాభాలను ఆర్జించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే.. సంస్థ ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో దాపు 8100 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య 2024 మొదటి త్రైమాసికం కంటే ఎక్కువే.

ఇప్పుడు కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 336300గా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ప్రారంభం నుంచి పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్నాయి. అయితే టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలో మాత్రం ఉద్యోగులు సంఖ్య కొంత పెరిగింది. కాగా హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గింది.
 

#Tags