Infosys Appointment Letters Issued

న్యూఢిల్లీ: క్యాంపస్‌ నియామకాల్లో భాగంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ 1,000 మందికిపైగా అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేసినట్టు సమాచారం. అభ్యర్థుల ఆన్‌బోర్డింగ్‌ సెపె్టంబర్‌ చివర లేదా అక్టోబర్‌ నుండి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇన్ఫోసిస్‌ నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు.

2022 బ్యాచ్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు వీరిలో ఉన్నారని ఐటీ, ఐటీఈఎస్‌ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (ఎన్‌ఐటీఈఎస్‌) వెల్లడించింది. రెండేళ్లుగా వీరంతా నియామక పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని ఎన్‌ఐటీఈఎస్‌ ప్రెసిడెంట్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ సలూజా తెలిపారు. 

Guest Lecturer Posts: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టుకు ఇంటర్వ్యూలు

‘మేము అప్రమత్తంగా ఉంటాం. ఇన్ఫోసిస్‌ ఈ నిబద్ధతను గౌరవించడంలో విఫలమైనా, చేరే తేదీని ఉల్లంఘించినా ఇన్ఫోసిస్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టడానికి వెనుకాడము’ అని హెచ్చరించారు.

2022–23 రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో సిస్టమ్‌ ఇంజనీర్, డిజిటల్‌ స్పెషలిస్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకు ఎంపికైన 2,000 మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లను ఆన్‌బోర్డింగ్‌ చేయడంలో ఆలస్యం చేసినందుకు ఇన్ఫోసిస్‌పై కార్మి క, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఎన్‌ఐటీఈఎస్‌ గతంలో ఫిర్యాదు చేసింది.  

Minor Degree Programme In Engineeing Colleges: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మైనర్‌ డిగ్రీ.. ఇకపై ఆ సబ్జెక్టులు కూడా చదవాల్సిందే!

ఫ్రెషర్లకు ఇచి్చన ఆఫర్‌ లెటర్లను కంపెనీ గౌరవిస్తుందని ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌ ఇటీవలే స్పష్టం చేశారు. ‘కొన్ని నియామక తేదీలను మార్చాం. అందరూ ఇన్ఫోసిస్‌లో చేరతారు. ఆ విధానంలో ఎటువంటి మార్పు లేదు’ అని వెల్లడించారు. 

#Tags