ITBP Temporary Jobs : ఐటీబీపీలో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ఈ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు

ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) తాత్కాలిక ప్రాతిపదికన గ్రూప్‌–సి(నాన్‌–గెజిటెడ్‌–నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 20.
»    పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌–12, హెడ్‌ కానిస్టేబుల్‌–1, కానిస్టేబుల్‌–7.
»    విభాగాలు: ల్యాబొరేటరీ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్,ఓటీ టెక్నీషియన్,ఫిజియోథెరపిస్ట్, సెంట్రల్‌ స్టెరిలైజేషన్‌ రూమ్‌ అసిస్టెంట్, టెలిఫోన్‌ ఆపరేటర్‌ కమ్‌ రిసెప్షనిస్ట్,డ్రెస్సర్, లెనిన్‌ కీపర్‌.
»    అర్హత: ఇంటర్మీడియట్‌ (ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/బయాలజీ) ఉత్తీర్ణులవ్వాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    వయసు: 25 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    వేతనం: నెలకు అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు రూ.29,000 నుంచి రూ.92,300, హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100, కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100.
»    ఎంపిక విధానం: ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్,ఫిజి కల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.11.2024
»    వెబ్‌సైట్‌: https://itbpolice.nic.in

 Bank of Baroda : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో వివిధ విభాగాల్లో 592 పోస్టులు

#Tags