Government school Student Selected For NASA: రూ. 150ల ప్రాజెక్టుతో నాసాకు ఎంపికయ్యాడు, ఏం తయారు చేశాడో తెలుసా?

ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఓ బాలుడు నాసాకి ఎంపికయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. జస్ట్‌ అతడు చేసిన రూ. 150ల ప్రాజెక్టు అమెరికన్‌ స్పేస్‌ ఏజెన్సీ నాసా నిర్వహించే ఇంజనీరింగ్‌ డిజైన్‌ ఛాలెంజ్‌ టీమ్‌లో సెలక్టయ్యేలా చేసింది. ఓ సాదాసీదా ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటూ నాసాకి ఎంపికవ్వడమే కాకుండా తన అద్భుత మేధాతో అందర్నీ అబ్బురపరుస్తున్నాడు ఈ బాలుడు. 

గ్రేటర్‌ నోయిడాలోని దాద్రీలోని చిన్నగ్రామమైన ఛాయ్‌సన్‌కు చెందిన 15 ఏళ్ల ఉత్కర్ష్‌ అనే బాలుడు నాసాకు వెళ్తున్నాడు. పదోవతరగతి చదువుతున్న ఈ ఉత్కర్ష్‌ జనవరిలో సైన్స్‌ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ పోటీల్లో వివిధ పాఠశాల విద్యార్థులంతా సుమారు రూ. 25 వేల నుంచి లక్షలు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు ప్రిపేర్‌ చేస్తే, ఉత్కర్ష్‌ కేవలం రూ. 150ల ప్రాజెక్టుతో పాల్గొన్నాడు. అంతమంది విద్యార్థుల మందు నిలబడగలనా? అనుకున్న ఉత్కర్ష్‌ ..తన అద్భుత ప్రతిభతో తయారు చేసిన వైర్‌లెస్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఛార్జర్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

అబ్బురపరుస్తున్న ఉత్కర్ష్‌ ప్రాజెక్ట్‌

అదికూడా తక్కువ మొత్తంలో ప్రాజెక్టుని ప్రజెంట్‌ చేయడంతో ఉత్కర్షని అంతా ప్రశంసలతో ముంచెత్తారు. అతడిలో ఉన్న ఆ అసాధారణ మేధస్సే నాసా  హ్యుమన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ రోవర్‌ ఛాలెంజ్‌(హెచ్‌ఈఆర్‌సీ) అని పిలిచే ఇంజనీర్‌ డిజైన్‌ ఛాలెంజ్‌ 2024లో పాల్గొనే కైజెల్‌ టీమ్‌లో ఉత్కర్షని భాగమయ్యేలా చేసింది. అమెరికన్‌ స్పేస్‌ ఏజెన్సీ నాసా మానవ అంతరిక్ష పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులనే భాగం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా ఇంజనీరింగ్‌ డిజైన్‌ ఛాలెంజ్‌ని నిర్వహిస్తుంది. ఆ రోవర్‌ ఛాలెంజ్‌లో ఉత్కర్ష్‌ తన బృందంతో కలసి పాల్గొననున్నాడు.

ఈ ఛాలెంజ్ వచ్చే నెల ఏప్రిల్ 18 నుంచి 20, 2024 వరకు జరుగుతుంది. ఇక ఉత్కర్ష నేపథ్యం వచ్చేటప్పటికీ..ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. వారి తల్లిదం​డ్రులకు వ్యవసాయమే జీవనాధారం. ఉత్కర్ష్‌ తన తాత సురేంద్ర సింగ్‌ చేసే వ్యవసాయ పనుల్లో సాయం చేస్తుంటాడు కూడా. చిన్నతనంలోనే ఉత్కర్ష్‌ బ్రెయిన్‌ హేమరేజ్‌కి గురయ్యి దాదాపు మూడు నెలలు వెంటిలేటర్‌ ఉన్నట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. "మృత్యముఖం నుంచి కాపడుకున్నా మా బిడ్డ ఈ రోజు ప్రతిష్టాత్మకమైన నాసా వంటి అంతరిక్ష పరిశోధనా సంస్థకు ఎంపిక కావడం అన్నది మాకెంతో గర్వంగా ఉంది". అని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు.

నాసా ఇంజనీరింగ్‌ ఛాలెంజ్‌ టీంకు ఎంపిక

ఇక ఉత్కర్ష్‌ తోపాటు పదోవతరగతి చదువుతున్న టౌరుకు చెందిన లోకేష్‌ కుమార్‌, గుహ, గురుగ్రామ్‌కి చెందిన పల్లవి, ఫరీదాబాద్‌కి చెందిన అరుణ్‌ కుమార్‌, పానిపట్‌ నుంచి రోహిత్‌ పాల్‌, నోయిడా నుంచి ఓమ్‌ తదితర విధ్యార్థులు ఎంపికయ్యారు. ఎంత్రీఎం ఫౌండేష్‌ ఈ వైఎంఆర్‌డీ టీమ​ కైజెల్‌కి మద్దతు ఇస్తుంది. నాసా నిర్వహించే ఈ ఇంజనీరింగ్‌ ఛాలెంజ్‌లో భారత్‌ తరుఫు నుంచి ఎనిమిది టీమ్‌లను ఎంపిక చేయగా, వాటిలో ఎన్జీవో మద్దతు గల  జట్టే ఈ కైజెల్‌ టీమే. 

#Tags