Gurukula schools Teacher jobs: గురుకుల పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో అతిథి టీచర్లుగా పనిచేసేందుకు అర్హత, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ పద్మజ తెలిపారు. ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ఐదు గురుకుల పాఠశాలల్లో 2024–25 విద్యాసంవత్సరానికి ఇంగ్లిషు మాద్యమంలో బో ధించేందుకు అతిథి టీచర్లను నియమించనున్నట్లు చెప్పారు.
Good News For Womens: ప్రతి మహిళకు 5లక్షల..దరఖాస్తు చేసుకున్న 2రోజుల్లోనే డబ్బు: Click Here
అభ్యర్థులు బీఈడీతోపాటు టెట్ అర్హత సాధించి ఉండాలన్నారు. పీజీలో 55 శాతం మార్కు లు, బీఈడీలో సంబంధిత సబ్జెక్టు మెథడాలజీ ఉండాలని తెలిపారు. మహిళా కోటాలో జేఎల్ ఇంగ్లి షు, జేఎల్ ఫిజిక్స్, జేఎల్ కామర్స్, ఈజీటీ సోషల్ స్టడీస్, టీజీటీ హిందీ పోస్టులు ఒక్కొక్కటి వంతున ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే టీజీటీ సోషల్ స్టడీస్ 2, పీఈటీలు 2 ఉన్నాయన్నారు.
పురుషుల కోటాలో జేఎల్ ఫిజిక్స్, పీజీటీ సోషల్, టీజీటీ హిందీ, టీజీటీ ఇంగ్లిషు, టీజీటీ గణితం, టీజీటీ ఫిజిక్స్, పీఈటీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 13వ తేదీ లోపు జిల్లా కేంద్రంలోని ఎంప్లాయీమెంట్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న జిల్లా డీసీఓ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలన్నారు. ఈ నెల 17వ తేదీన సంజయ్‌గాంధీ నగర్‌లోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్ కళాశాలలో డెమో తరగతులు నిర్వహించి, ఎంపికలు చేస్తామని ఆమె వెల్లడించారు.