Zero Students.. AP Government Schools : ఏపీ ప్రభుత్వ పాఠశాలలు ఖాళీ అవుతున్నాయ్.. 6216 స్కూళ్లలో 10మందిలోపే..! కారణం ఇదేనా..?
అలాగే గత ప్రభుత్వం విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి మంచి విద్యను అందించేవారు. దీంతో విద్యార్థులకు ప్రభుత్వ స్కూల్స్‌పై మంచి నమ్మకం.. భరోస ఉండేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడా ఏ పిల్లవాడికి కూడా ఇవ్వలేదు. అలాగే విద్యార్థులకు సరైన సౌకర్యాలు కూడా అందించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలం చెందింది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఘోరంగా మారింది. విద్యార్థులకు ప్రభుత్వ స్కూల్స్‌పై నమ్మకం పోతుంది.
6216 స్కూళ్లలో 10మందిలోపే..
మొత్తం 44వేల ప్రభుత్వ పాఠశాలలకు గాను 6216 స్కూళ్లలో 10మందిలోపే విద్యార్థులున్నారు. 104 పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. 81 స్కూళ్లు కేవలం ఒకే విద్యార్థితో నడుస్తున్నాయి. సర్కారు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే పరిస్థితి వస్తుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.