Anganwadi Pre Schools: ప్రీ స్కూల్‌గా అంగన్‌వాడీలు

Anganwadi Pre Schools

మహబూబ్‌నగర్‌ రూరల్‌: పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగానే అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలలు (ప్రీ స్కూల్స్‌గా) తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది.

Anganwadi news: అంగన్‌వాడీ టీచర్లకు, వర్కర్లలకు Bad News...

ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనుంది. ఇక నుంచి ఆయా కేంద్రాల్లో కొనసాగనున్న ఆంగ్ల మాధ్యమం బోధనకు సంబంధించి జిల్లా నుంచి 11 మంది సూపర్‌వైజర్లకు విద్యా బోధనపై హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. మాస్టర్‌ ట్రైనర్లు అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లకు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సెక్టార్ల వారీగా శిక్షణ ఇస్తున్నారు. పిల్లల్లో క్రమశిక్షణతో పాటు తారతమ్యం లేకుండా యూనిఫాం అమలు చేయనుంది. కాగా.. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనే ప్రీ స్కూల్స్‌ నిర్వహణ చేపట్టనున్నారు.

విద్యాబోధనలో మార్పులు..

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పోషకాహారం అందించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో విద్యా బోధన చేపడుతున్నారు. అయితే ప్రీ స్కూల్‌లో మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ స్థాయిలుగా ప్రేరణాత్మక, కృత్యాధార బోధన ఉంటుందని అంగన్‌వాడీ టీచర్లు తెలిపారు.

జూన్‌ నుంచి ఆగస్టు వరకు ఆటపాటలు, ప్రకృతి, సైన్స్‌, యోగా, పూర్వ గణితం, రంగులు ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ కార్యక్రమాలతో పాటు కృత్యాలతో పిల్లలకు విద్యా బోధన చేస్తారు. ప్రతి నెల 4వ శనివారం పూర్వ ప్రాథమిక విద్యా దినోత్సవం జరిపి కృత్యాలు, కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. పిల్లల్లో వచ్చిన మార్పులు, అభివృద్ధిని తల్లిదండ్రులకు తెలియజేస్తారు.

నేటి నుంచి ప్రారంభం..

ప్రీ స్కూల్‌కు ఎంపికై న కేంద్రాలకు సరఫరా చేసిన పుస్తకాల సిలబస్‌లో కూడా కొంత మార్పు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రీ స్కూల్‌ చదివే పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా యూనిఫాం అందించనుంది. సోమవారం నుంచి ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించి, చిన్నారులకు ఉచిత పుస్తకాలు, యూనిఫాం కూడా పంపిణీ చేయనున్నారు.

పూర్వ ప్రాథమిక విద్య బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు

విడతల వారీగా టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు

చిన్నారులకు ఉచిత పుస్తకాలు,

యూనిఫాంల సరఫరా

జిల్లావ్యాప్తంగా 1,184 కేంద్రాలు.. 1,148 మంది టీచర్లు

మహిళా, శిశు సంక్షేమ శాఖకే నిర్వహణ బాధ్యత

ప్రీ ప్రైమరీ విద్యపై శిక్షణ

మాస్టర్‌ ట్రైనర్లు అయిన సూపర్‌వైజర్ల ద్వారా అంగన్‌వాడీ టీచర్లకు ప్రీ ప్రైమరీ విద్యపై ప్రాజెక్టుల వారీగా శిక్షణ ప్రారంభించాం. పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ప్రీ స్కూళ్లను ఏర్పాటు చేస్తుంది. సంబంధిత మెటీరియల్‌, కిట్స్‌, పుస్తకాలు, యూనిఫాం త్వరలోనే కేంద్రాలకు సరఫరా అవుతాయి. – జరీనాబేగం,

జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి

శిక్షణ షెడ్యూల్‌ ఇలా..

జిల్లాలో ప్రీస్కూల్‌ నిర్వహణ, విద్యా బోధనపై మే నెలలోనే సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చారు. మాస్టర్‌ ట్రైనర్లు అయిన పదిమంది సూపర్‌వైజర్లు ఒక్కో బ్యాచ్‌లో 35 మంది అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. టీచర్లు శిక్షణను పూర్తి చేసుకున్న అనంతరం ప్రీ స్కూల్స్‌ నిర్వహణను లక్ష్యం మేరకు చేపట్టడానికి సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు.

#Tags