Telangana Schools New Timings 2024 : తెలంగాణ‌లో స్కూల్స్ టైమింగ్స్‌లో చేసిన‌ మార్పులు ఇవే..! ఇక‌పై ఉద‌యం 9.00 నుంచి..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలోని ఉన్నత పాఠశాలల పని వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. హైస్కూల్ వేళలు ఉద‌యం 9.30 నుంచి సాయంత్రం 4.45కి బదులుగా.. ఇక‌పై ఉద‌యం 9:00 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు కొనసాగ‌నున్నాయి.

జూలై 22వ తేదీన (సోమవారం) నుంచి ఈ టైమింగ్స్ అమలవుతాయన్న ప్రభుత్వం తెలిపింది. ఈ మేర‌కు తెలంగాణలో పాఠశాలల వేళలను మారుస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టైమింగ్స్‌ ఎప్పటి వరకు అనే దానిపై ప్ర‌భుత్వం స్పష్టతనివ్వలేదు.

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో మాత్రం..
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమలులో ఉన్న పని వేళలు కొనసాగుతాయని పేర్కొంది. జంట నగరాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశించారు.

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 27-07-2024 : (శనివారం) బోనాలు
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛ 07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

#Tags