Summer Holidays: ఈనెల 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం.. ఎప్పటి వరకు..?
ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యి వారి పత్రాల మూల్యాంకనం కొనసాగుతుంది. అయితే, విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటించారు పాఠశాల విద్యాశాఖ కమిషనర్..
అన్నమయ్య: 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు అన్ని యాజమాన్య పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
Annual Exams: నేటి నుంచి వార్షిక పరీక్షలు..
ఇప్పటికే పదోతరగతి వార్షిక పరీక్షలు పూర్తయి మూల్యాంకనం కూడా జరుగుతోంది. ఇక 1–9 తరగతుల విద్యార్థులకు ఈనెల 6 నుంచి 18 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. 19 నుంచి 21లోపు ఆయా పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. చివరి రోజు ప్రొగ్రెస్ కార్డులు విద్యార్థులకు అందజేస్తారు.
#Tags