Students dharna: చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ధర్నా
సాక్షి, అనంతపురం జిల్లా: చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో విద్యార్థులు పోరుబాట ప్రారంభించారు. విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ మహా ధర్నా జరిగింది.
Click Here: గుడ్‌న్యూస్ తెలంగాణ అంగన్‌వాడీలలో 9వేల ఉద్యోగాలు..
తల్లికి వందనం పథకం కింద ఒక్కొ విద్యార్థి కి 15 వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
కాగా, విద్యా వ్యవస్ధను నిర్వీర్యం చేసే విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చివేయడంతో పాటు పలు సంస్కరణలు తీసుకొచ్చింది.. వాటిని నీరుగార్చే విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
#Tags