Schools Holidays Due to Heavy Rain: బ్రేకింగ్‌ న్యూస్‌.. భారీ వర్షాల కారణంగా ఏపీలో స్కూళ్లకు సెలవులు

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో  నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని స్కూళ్లకు నేడు(మంగళవారం)సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు.

Navodaya Vidyalaya Admissions : నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తులకు నోటిఫికేషన్‌.. సీటు వస్తే ఏడేళ్ల పాటు ఉచితంగా విద్యాబోధన

మిగతా జిల్లాల్లో వర్షాలు, వరదల పరిస్థితిని బట్టి కలెక్టర్లు రేపు ఉదయంలోగా విద్యాసంస్థలకు సెలవుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ వ‌ర్షాలు ఇలాగే ఉంటే.. ఈ స్కూల్స్ సెల‌వులు పొడిగించే అవ‌కాశం ఉంది.అటు ధవళేశ్వరం వద్ద 13.3 అడుగులకు నీటిమట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 27-07-2024 : (శనివారం) బోనాలు
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛ 07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

#Tags