Schools Holiday News: స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. ప్రభుత్వం ఉత్తర్వులు

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలుగు రాష్ట్రాలు వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Schools Holiday News

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఇప్పటికే వర్ష ప్రభావిత జిల్లాలలోని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

Jobs In LIC: నిరుద్యోగులకు ఎల్‌ఐసీ గుడ్‌న్యూస్‌.. నెలకు రూ. 25వేల జీతం

రాయచోటి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు, జూనియర్‌ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఛామకూరి శ్రీధర్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు.. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Vacancies In India Post Payments Bank: ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ. 30వేల జీతం

ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలన్నీ పాటించాలని ఆదేశించారు.ఏపీలోని పలు జిల్లాలతో పాటు తమిళనాడులోనూ భారీ వర్ష ప్రభావం ఉండటంతో.. ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
 

#Tags