Schools and Colleges Holidays in August 2024 : ఆగస్టు నెలలో స్కూల్స్, కాలేజీలకు దాదాపు 10 రోజులు సెలవులు..! ఎందుకంటే..?
ఈ నెలలో మొత్తం ఆగస్టు 4, 11, 18, 25 తేదీలు నాలుగు ఆదివారాలు రానున్నాయి. అలాగే ఆగస్టు 10వ తేదీ రెండో శనివారం, ఆగస్టు 24వ తేదీన నాలుగో శనివారం రానున్నాయి. మొత్తం మీద సాధారణ సెలవులు 6 రోజులు స్కూల్స్ ,కాలేజీలకు సెలవులు రానున్నాయి.
ఆగస్టు 9వ తేదీన..
ఆగస్టు 9వ తేదీన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆ రోజున సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలు, కొన్ని ఆదివాసీ రాష్ట్రాలు ఇప్పటికే ఆగస్టు 9వ తేదీన సెలవు ప్రకటించాయి. ఆ రోజున ఆదివాసీలకు సంబంధించిన సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలు చర్చించుకోవడానికి వారు అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణలోనూ ఆగస్టు 9వ తేదీన సెలవు ఇవ్వాలని మంత్రి సీతక్క సీఎంకు విజ్ఞప్తి చేశారు.
ఆగస్టు 15, 19, 26 తేదీల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు..
15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్ని స్కూల్స్ ,కాలేజీలు, ఆఫీసులకు సెలవులు ఉంటుంది. అలాగే ఆగస్టు 19వ తేదీన (సోమవారం) రాఖీ పండగ (Raksha Bandhan) సందర్భంగా స్కూల్స్, కాలేజీలు సెలవు ఉండే అవకాశం ఉంటుంది. 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి పండగ. ఈ రోజులు కూడా అన్ని స్కూల్స్ ,కాలేజీలు సెలవులు ఉంటుంది. దాదాపు 2024 ఆగస్టు నెలలో స్కూల్స్, కాలేజీలకు 10 రోజులు వరకు సెలవులు రానున్నాయి. అలాగే ఏమైన బంద్‌లు, భారీ వర్షాల వల్ల స్కూల్స్, కాలేజీలకు సెలవులు వచ్చే అవకాశం ఉంది.
➤☛ Good News For School Students : స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇకపై వీరికి 10 రోజులు పాటు..
ఆగస్టు నెలలో బ్యాంక్‌లకు భారీగా సెలవులు.. మొత్తం..?
సెలవు క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టులో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు నెల బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. సాధారణంగా, బ్యాంకు బ్రాంచ్‌లు ప్రతి ఇతర శనివారం (రెండవ, నాల్గవ) అన్ని ఆదివారాలు పనిచేయవు. ప్రభుత్వ సెలవులతో పాటు.. రాష్ట్ర పండుగల సమయంలో ఆయా రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులు పనిచేయవు. ఈ ఆగస్టు నెలలో సెలవుల దినాలను పరిశీలించి బ్యాంక్ పనులను నిర్ణయించుకోవచ్చు.
2024 ఆగస్టు నెలలో బ్యాంక్ సెలవులు ఇవే..
➤☛ ఆగస్టు 3 (శనివారం) : కేర్ పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు క్లోజ్
➤☛ ఆగస్టు 4 (ఆదివారం) : వారాంతపు సెలవు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్
➤☛ ఆగస్ట్ 8 (సోమవారం) : గ్యాంగ్‌టక్‌లో, టెండాంగ్ లో రమ్ ఫాత్ సందర్భంగా బ్యాంకులు మూసివేత
➤☛ ఆగస్టు 10 (శనివారం) : రెండో శనివారం.. దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు
➤☛ ఆగస్టు 11 (ఆదివారం) : వారాంతపు సెలవు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
➤☛ ఆగస్టు 13 (మంగళవారం) : దేశభక్తుల దినోత్సవం సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకుల మూసివేత
➤☛ ఆగస్టు 15 (గురువారం) : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు పనిచేయవు
➤☛ ఆగస్టు 18 (ఆదివారం) : వారాంతంలో అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
➤☛ ఆగస్టు 19 (సోమవారం) : రక్షా బంధన్ సందర్భంగా త్రిపుర, గుజరాత్, ఒడిశా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు పనిచేయవు.
➤☛ ఆగస్టు 20 (మంగళవారం) : శ్రీనారాయణ గురు జయంతిని పురస్కరించుకుని కొచ్చిలో బ్యాంకులు మూతపడనున్నాయి.
➤☛ ఆగస్టు 24 (శనివారం) : నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్
➤☛ ఆగస్టు 25 (ఆదివారం) : వారాంతంలో అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
➤☛ ఆగస్టు 26 (సోమవారం) : జన్మాష్టమి లేదా కృష్ణ జయంతి సందర్భంగా గుజరాత్, ఒడిశా, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, జమ్ము, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవుదినం.