School Holiday Today : నేడు అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు

తిరుపతి ఎడ్యుకేషన్‌ : క్రిస్మన్‌ పండుగ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన ఆప్షనల్‌ హాలిడేగా ప్రకటించినట్లు డీఈఓ కేవీఎన్‌.కుమార్‌ తెలిపారు. జిల్లాలోని ఎంఈఓలు, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్కూల్‌ అటెండెన్స్‌ యాప్‌లో ఆప్షనల్‌ హాలిడేను నమోదు చేసి సెలవును వినియోగించుకోవచ్చని డీఈఓ పేర్కొన్నారు.
School Holiday Today

రాయచోటి (జగదాంబసెంటర్‌) : అన్ని ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ఈ నెల 24న ఐచ్ఛిక సెలవుగా ప్రకటించినట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి కె.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఉప విద్యాశాఖ, మండల విద్యాశాధికారులు, అన్ని యాజామాన్యాల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన తెలియజేశారు.

అటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు నేటి నుంచి డిసెంబర్‌ 26 వరకు సెలవులు ప్రకటించారు. అంటే డిసెంబర్ 24, 25, 26 (మంగళ, బుధ, గురు) మూడురోజులు క్రిస్మస్ సెలవులు ఉంటాయి.

తిరిగి, డిసెంబర్ 29వ తేదీన‌ ఆదివారం సాధారణ సెలవులు. మొత్తంగా వచ్చేవారం ఐదురోజుల సెలవులు వస్తున్నాయి. అంటే శ‌నివారం సాధార‌ణ సెల‌వు కాని విద్యాసంస్థ‌ల‌కు   స్కూళ్లు, కాలేజీలు నడిచేది డిసెంబర్ 23 (సోమవారం), డిసెంబర్ 27, 28 (శుక్ర, శనివారం) మూడురోజులు మాత్రమే.

Three Days School Holidays: నేటి నుంచి మూడురోజుల పాటు స్కూళ్లకు సెలవులు..

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags