Sainik School Admissions: సైనిక్ స్కూల్‌లల్లో అడ్మిషన్లు.. ముఖ్యమైన వివరాలు ఇవే..
సాక్షి ఎడ్యుకేషన్: 2025-26 సెషన్‌లో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ దరఖాస్తులు చేసిన తర్వాత, ఆల్ ఇండియా స్థాయిలో పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.
డిగ్రీ అర్హతతో NIACLలో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం నెలకు 42000: Click Here
ఇందుకు సంబందించిన తేదీ తర్వాత ప్రకటిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ పాఠశాలల్లో ఈ పరీక్షతోనే ప్రవేశాలు జరుగుతాయి. కొత్త సైనిక్ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశం కూడా ఈ పరీక్షతోనే జరుగుతుంది. అయితే, సైనిక్ స్కూల్‌లో చేరేందకు విద్యార్థులకు కావాల్సిన అర్హతలు, రాయాల్సిన పరీక్షలు వంటి వివరాలను ఒకసారి పరిశీలించండి..
వయో పరిమితి: 6వ తరగతిలో ప్రవేశానికి, పిల్లల వయస్సు 31 మార్చి 2025 నాటికి 10 నుండి 12 సంవత్సరాల మధ్య ఉండాలి. 6వ తరగతి చదువుతున్న బాలికలకు మాత్రమే ఎన్‌రోల్‌మెంట్‌లు తీసుకుంటారు. 9వ తరగతిలో అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా మాత్రమే బాలికలకు ప్రవేశం కల్పిస్తారు. ఈ తరగతిలో ప్రవేశానికి, విద్యార్థుల వయస్సు 31 మార్చి 2025 నాటికి 13 నుండి 15 సంవత్సరాల మధ్య ఉండాలి.
విద్యార్థుల అర్హత: 9వ తరగతిలో ప్రవేశానికి, విద్యార్థి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 800 కాగా, ఎస్టీ/ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రవేశ పరీక్ష: సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్ కోసం, దేశవ్యాప్తంగా 190 నగరాల్లో రాత పరీక్షలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. 6వ తరగతిలో ప్రవేశానికి 150 నిమిషాల పేపర్ ఉంటుంది. ఇది 300 మార్కులకు ఉంటుంది. ఈ పేపర్‌లో భాష, గణితం, తెలివి తేటలు, సాధారణ పరిజ్ఞానం తదితర అంశాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి.
ఇక, తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి 180 నిమిషాల పరీక్ష ఉంటుంది. ఈ పేపర్‌లో గణితం, ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, సోషల్ సైన్స్ తదితర సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు ప్రతి విభాగంలో కనీసం 25% మార్కులు, మొత్తం 40% మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు ఈ షరతు వర్తించదు.
అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ aissee.nta.nic.inని సందర్శించడం ద్వారా ఈ తరగతుల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో జనవరి 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.