KGBV Admissions: ఆన్‌లైన్‌లో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు.. చివరి తేదీ..
అర్హులు, ఆసక్తిగల విద్యార్థులు కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ మెరకు చివరి తేదీని ప్రకటించారు పాఠశాల ప్రిన్సిపాల్..
కొనకనమిట్ల: మండలంలోని గొట్లగట్టు కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఆరో తరగతి, ఎనిమిదో తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ (ఎంపీసీ)లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ రాఘవ సురేఖ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో 40, ఇంటర్ ఫస్ట్ ఇయర్ (ఎంపీసీ)లో 40 మందికి సీట్లు ఉన్నాయన్నారు.
Students at Exam: పది, ఇంటర్ కోర్సులకు పరీక్షలు.. హాజరైన వారి సంఖ్య ఇంత..!
ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సురేఖ చెప్పారు. అనాథలు, బడిబయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సురేఖ సూచించారు. వివరాలకు 85007 23716 నంబరును సంప్రదించాలన్నారు.
#Tags