Free Education: ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు సిటీ: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో పేదలకు ఉచిత విద్య అందుతోందని, ఇందుకు 25 శాతం సీట్లను ప్రభుత్వం కేటాయించిందని, మంగళవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీఈఓ కె.శామ్యూల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్ని ప్రైవేటు స్కూళ్లలో 1వ తరగతిలో ప్రవేశాలకు విద్యార్థుల ఆధార్‌ కార్డు ద్వారా ప్రాథమిక వివరాలతో https://cse.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ సచివాలయం/ మండల విద్యా వనరుల కేంద్రం(ఎంఆర్‌సీ సెంటర్‌/ఎంఈఓ ఆఫీస్‌), సంబంధిత పాఠశాల నుంచే దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులకు లాటరీ ద్వారా సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఇతర వివరాలకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004258599కి ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.

చదవండి: Admissions: ‘ఏకలవ్య’లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

#Tags