Increase of School Fees : భారీగా పెరిగిపోతున్న ప్రైవేట్‌ పాఠ‌శాల‌ల ఫీజులు.. ఖ‌ర్చులు ఇలా..!

బడులు తెరుచుకోవడానికి ముందు నుంచే ఓ వైపు స్కూల్‌ ఫీజులు, మరోవైపు పుస్తకాల దందా కొనసాగుతోంది..

శ్రీకాకుళం: ప్రైవేటు పాఠశాలలు దోపిడీకి తెర తీశాయి. చాలా పాఠశాలలు విద్యను సేవగా అందిస్తుండగా కొందరు మాత్రం ఈ ముసుగులో సిండికేట్‌గా ఏర్పడి ఏటా ఫీజులను అమాంతం పెంచేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫీజులు భారీగా పెంచేశారు. స్కూల్‌ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం పేరుతో సామాన్యుల నడ్డి విరుస్తున్నారు.

జిల్లాలో ఇది పరిస్థితి..

30 మండలాలతో కూడిన శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ప్రైవేటు పాఠశాలలు 398 ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 79, ప్రాథమికోన్నత 136, ఉన్నత పాఠశాలలు 183 ఉన్నాయి. వీటిన్నింటిలో కలిపి మొత్తం విద్యార్థులు 91,049 మంది చదువుతున్నారు. ఇందులో బాలురు 54194 మంది, బాలికలు 37755 మంది ఉన్నారు. ఈ పాఠశాలల్లో 3624 మంది టీచర్లు పాఠాలు బోధిస్తున్నారు. అలాగే జిల్లాలో పైవేట్‌ జూనియర్‌ కాలేజీలు 89 ఉన్నాయి. వీటిలో 39,510 మంది వరకు చదువుతున్నారు.

Free Training for Unemployed Youth : నిరుద్యోగ యువ‌త‌కు కంప్యూట‌ర్‌, ట్యాలీ నైపుణ్యంపై ఉచిత శిక్ష‌ణ‌..

రకరకాల పేర్లతో..

సూపర్‌ 60 అని, సీబ్యాచ్‌ అని, ఒలింపియాడ్‌ అని, ఐకాన్‌ అని ఇలా రకరకాల పేర్లతో ప్రైవేటు పాఠశాలలు భారీగా దండుకుంటున్నాయి. వాస్తవానికి ఈ నెల 13న పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. బడులు తెరుచుకోవడానికి ముందు నుంచే ఓ వైపు స్కూల్‌ ఫీజులు, మరోవైపు పుస్తకాల దందా కొనసాగుతోంది. ఆయా పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు యూనిఫాం కూడా తమ వద్దనే తీసుకోవాలని, స్టాక్‌ బయట లేదని సుస్పష్టం చేసేస్తున్నారు. స్కూళ్లలోనే కుట్టిన దుస్తులు అందజేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల క్లాత్‌లు అందజేస్తున్నారు. వీటితోపాటు లైబ్రరీ, వ్యాయామం, కంప్యూటర్‌ వర్క్‌, ల్యాబ్‌వర్క్స్‌, కల్చరల్‌ యాక్టివిటీస్‌, స్కూల్‌ బస్‌చార్జీల పేరుతో ఫీజులు దండుకుంటున్నారు. పాఠ్య పుస్తకాలతోపాటు నోట్‌బుక్స్‌, స్టడీ మెటీరియల్స్‌ తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందేనంటూ యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు.

D Pharmacy : డీ ఫార్మ‌సీతో ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు..

కోట్లలో వ్యాపారం..

ఒకటి నుంచి 5వ తరగతి వరకు ప్రైవేటు పాఠ్యాంశాలే ఉండటంతో యాజమాన్యాలు వారి ఇష్టం వచ్చిన ధరలకు పుస్తకాలు అమ్మేస్తున్నాయి. పెద్ద పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు పాఠ్య, తరగతి నోటు పుస్తకాలకు రూ.3వేల నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా తరగతి పెరిగే కొద్దీ వాటి ధరలను పెంచి వ్యాపారం కొనసాగిస్తున్నారు. పదో తరగతికి చేరే సరికి రూ.12వేల వరకు పుస్తకాలకే వెచ్చిస్తున్నారు. సాధారణ ప్రైవేటు పాఠశాలల్లో ప్రీమైమరీ నుంచి టెన్త్‌ వరకు రూ.1500 నుంచి రూ.6000 వరకు వసూలు చేస్తున్నారు. విద్యాశాఖాధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తూ వదిలేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు.

ITI Counselling : ఐటీఐ ప్ర‌వేశాల‌కు కౌన్సెలింగ్ ప్రారంభం..

ప్రభుత్వ బడుల్లో ఉచిత విద్య

ప్రభుత్వ బడుల్లో రూపాయి ఖర్చు లేకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గత ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. ఇంగ్లిష్‌ మీడియం విద్య, సిలబస్‌లో మార్పులు, తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలతో కూడిన బైలాంగ్విల్‌ పాఠ్యపుస్తకాల పుస్తకాలతోపాటు రూపాయి ఖర్చు లేకుండా స్టూడెంట్స్‌ కిట్స్‌ అందిస్తున్నారు. నాణ్యమైన రుచికరమైన పీఎం–పోషణ్‌ గోరుముద్ద పేరిట మధ్యాహ్న భోజనం, ఆరోగ్యానికి రాగిజావ అందిస్తున్నారు. మనబడి నాడు–నేడుతో బడుల్లో సరికొత్త సదుపాయాలు ఉన్నాయి.

Road Transport Corporation: ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం.. అంత్య‌క్రియ‌ల వ్య‌యం పెంపు.. ఎంతంటే..

తనిఖీలు చేపడతాం

ప్రైవేటు పాఠశాలల్లో చేరకముందే విద్యార్థుల తల్లిదండ్రులు వాటికి అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. చాలా పాఠశాలలకు అనుమతి లేదు. రెన్యువల్‌ కూడా లేదు. అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటాం. ఫీజుల వివరాలను అన్ని స్కూళ్లలో నోటీసు బోర్డుల్లో విధిగా పేర్కొనాలి. పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతాం. తమకు ఆధారాలతో సహా విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే కచ్చితంగా చర్యలు చేపడతాం. యాజమాన్యాలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

– కె.వెంకటేశ్వరరావు, డీఈఓ శ్రీకాకుళం

Supreme Court On NEET UG Counselling: సుప్రీం కోర్టులో ‘నీట్‌’ పిటిషన్‌ తిరస్కరణ

#Tags