Response on School Problems: సాక్షి ఎడ్యుకేషన్‌కు స్పందన.. ఈ గ్రామంలో పాఠశాల సమస్యలపై ప్రభుత్వం చర్యలు.. ఇవే మార్పులు

బడి విద్యార్థులకు చదువుతోపాటు ఇతర విషయాల్లో కూడా పట్టు ఉండాలి. వారికి ఆటలు చదువు అన్నీ ఉండాలి. ఒకప్పుడు ఈ పాఠశాలలో వారికి సరైన వసతులు లేక చాలా ఇబ్బందులను ఎదురుకున్నారు.

సాక్షి ఎడ్యుకేషన్‌: నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తి మండలం ముకురాల అనే గ్రామంలో ఈ పాఠశాలను 50 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ బడిలో విద్యార్థులు ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులను ఎదురుకున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న సాక్షి ఎడ్యుకేషన్‌ డాట్‌కామ్‌, ప్రత్యేక న్యూస్‌ ఇచ్చింది. దీనికి ప్రభుత్వం స్పందించి పాఠశాలలో పలు మార్పులు చేశారు.  ప్రస్తుతం అందుకున్న సమాచారం ప్రకారం విద్యార్థులకు కలిగిస్తున్న ఇబ్బందులను గమనించి వారికి అవసరమైన వసతులను సిద్ధం చేశారు.

University Honorary Doctorate: దళిత ముద్దుబిడ్డకు ప్రతిష్టాత్మక ఫ్రాన్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్

అంతే కాకుండా తరగతి గదులను కూడా తీర్చిద్దారు. పిల్లల ఆటలు కొనసాగేందుకు గ్రౌండ్‌ని కూడా తీర్చిదిద్దారు. దీంతో విద్యార్థులు వారి చదువుకు అవసరమైన సదుపాయాలను అందించడంతోపాటు వారికి బడిలో ఎటువంటి సమస్యలు కలగకుండా ఉండే చర్యలు తీసుకున్నారు. దీనిపై స్పందిస్తూ అక్కడి విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సాక్షి ఎడ్యుకేషన్‌ కు ధన్యవాదాలు తెలిపారు.

#Tags