12 Thousand Rupees Scholarships News: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ 12వేల రూపాయల స్కాలర్‌షిప్స్‌ దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..

School Students scholarships

ఆదోని సెంట్రల్: ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావం తులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షి ప ను అమలు చేస్తోంది. 2024-25వ విద్యా సంవ త్సరానికి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 5వ తేదీ నుంచే ప్రారం భమవ్వగా ఈనెల 6వ తేదీ వరకు అవకాశం ఉంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, పురపాలక, ఎయిడెడ్, మం డల పరిషత్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చ. ఆయా పాఠ శాలల సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విద్యార్థుల దరఖాస్తు లను సమర్పించాల్సి ఉంటుంది..

స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే: Click Here

నెలకు రూ.వెయ్యి చొప్పున ఉపకార వేతనం 
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్షల్లో ప్రతిభ దాటిన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున సం వత్సరానికి రూ.12,000లు ఆర్థిక సాయం ఆం దిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు నాలుగేళ్ల పాటు ఈ సాయం అందిస్తారు. ఈ మేరకు నగదును ప్రతి ఏటా విద్యార్థి ఖాతాలో జమ చేస్తారు. చదువుకోవాలని ఆశ ఉండి పేదరికం ఆర్థిక పరమైన ఇబ్బందులు ద్వారా విద్యకు దూరమైన విద్యార్థినీ, విద్యార్థులు ఈ ఆర్థిక సహాయం ఎంతో గానో ఉపయోగపడుతుంది. 

దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు 
ప్రభుత్వ, పురపాలక, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తల్లిదండ్రుల వార్షికా దయం రూ.3,50,000లకు మించ కూడదు. పాఠ శాలలో రెగ్యూలర్ విధానంలో చదువుతుండాలి. రాత పరీక్షలు ద్వారా స్కాలర్షిప్ పొందడానికి విద్యార్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకోవదానికి ఓసీ, బీసీ విద్యార్థులు అయితే పరీక్షల రుసుము రూ. 100లు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే పరీక్ష రుసుము రూ. 50లు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సెప్టెంబర్ 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుమును ఆన్లైన్ అప్లికేషన్లో ఇవ్వబడిన ఎస్బీఐ కలెక్ట్ లింకు ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులను ప్రభుత్వ వెబ్సైట్ www.bse.ap.gov.in నందు నమోదు చేసుకొనవచ్చును. దరఖాస్తు చేసే సమ యంలో విద్యార్థి ఆధార్ కార్డులో ఉన్న విధంగానే విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరులను నమోదు చేయాల్సి ఉంటుంది.

 

#Tags