Anganwadi employees Dharna: అంగన్వాడీ ఉద్యోగుల ధర్నా
సాక్షి ఎడ్యుకేషన్: అంగన్వాడీల్లోని ఉద్యోగులకు సరైనా జీతాలు, సదుపాయాలు లేక అధికారులను ఆశ్రయించగా ఎవ్వరూ స్పందించలేదు. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు కొన్ని రోజులుగా ధర్నా చౌక్‌లో ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సెక్రటేరియట్‌కు వారంతా వచ్చి మంత్రి సీతక్కను కలిశారు.
TSPSC Group 2 exam New Rules: గ్రూప్ 2 పరీక్షలకు కొత్త నిబంధనలు: Click Here
వారికి నెల జీతంగా రూ.18 వేలకు పెంచాలని, అంతేకాకుండా.. అంగన్‌వాడీలు, మినీ అంగన్‌వాడీలకు పెండింగ్‌లో ఉన్న ఏడు నెలల వేతన బకాయిలు చెల్లించాలని, గత ప్రభుత్వంలో చేసిన సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు.
మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాంలుగా చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 63 లక్షల మంది స్వశక్తి సంఘాల మహిళలకు ప్రత్యేక డిజైన్లలో చీరలు తయారు చేయించింది. అలాగే అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఇచ్చే చీరలను గురువారం మంత్రి సీతక్క చీరల డిజైన్లు పరిశీలించారు. కార్యక్రమంలో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.