Bad news for Anganwadi teachers: అంగన్‌వాడీ టీచర్లకు, హెల్పర్లకు బ్యాడ్‌న్యూస్‌

Bad news for Anganwadi teachers

రాయదుర్గం: పౌష్టికాహారం పేరుతో అంగన్వాడీ కేం ద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అంది స్తున్న కోడిగుడ్లలో 'చిన్న' చూపు కనిపిస్తోంది. పరిమా ణంలో చిన్నగా ఉన్న గుడ్లను చూడగానే అందరిలోనూ అవి కోడి గుడ్లు కాదనే అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. దీంతో వాటిని తీసుకునేందుకు లబ్దిదారులు నిరాకరిస్తున్నారు.

Tomorrow Job Mela: రేపు జాబ్ మేళా

కోడిగుడ్డు నాణ్యత నగుబాటు.. 
జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,302 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా 7 నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలకు ప్రతి నెలా 2.5 లీటర్ల పాలు, 2.50 కిలోల బాలామృతం, 25 కోడి గుడ్లు, గర్భిణులు, బాలింతలకు 25 కోడిగుడ్లు ఇస్తారు. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు 100 గ్రాముల పాలు, కోడిగుడ్డు, నాణ్యమైన భోజనం అం దిస్తారు. ఇందులో ఎక్కువ క్యాలరీలుంటాయని చెప్పుకునే కోడిగుడ్డలో నాణ్యత నగుబాటైంది. దీనిపై ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించేందుకు అంగన్వాడీ కార్యకర్తలు భయపడుతున్నారు. 

కాంట్రాక్టర్లకు కాసుల వర్షం.. 
అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా అనేది కాం ట్రాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. సాధారణంగా ఓ గుడ్డు 50 గ్రాముల బరువుండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్లను సరఫరా చేసే ఏజెన్సీ నిర్వాహకులు చాలా వరకూ నాసిరకంగా ఉన్న వాటినే అందజేస్తున్నారు.. తక్కువ పరిమాణంలో ఉన్న గుడ్లు, మురిగిపోయి కుళ్లు వాసన వస్తున్నవి సరఫరా చేసి చేతులు దులుపుకుంటు న్నారు. గుడ్లు చిన్నగా ఉంటున్నాయని. ఉడికించిన వెం టనే కొన్ని నెర్రలు చీలి దుర్గంధం వస్తోందని గర్భి ణులు, బాలింతలు చేస్తున్న ఫిర్యాదులు బుట్టదాఖలు అవుతున్నాయి. 30 గ్రాముల్లోపే బరువున్న కోడిగుడ్లను చూడగానే తీసుకునేందుకు తటపటాయిస్తున్నారు.

 

#Tags