August 21st Schools and Colleges Closed : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆగ‌స్టు 21న స్కూల్స్ బంద్..? కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్స్‌, కాలేజీ విద్యార్థుల‌కు ఆగ‌స్టు నెల నిజంగా పండ‌గే. ఎందుకంటే.. ఆగస్టు నెలలో పండగలతోపాటు కొన్ని ప్ర‌త్యేక రోజులతో రావడంతో పాఠశాలలకు భారీగా సెలవు వస్తున్నాయి.

తాజాగా ఈ సెల‌వుల జాబితాలో మరో రోజు అనుకోని సెలవు బంద్ రూపంలో జత అయ్యింది. 

➤☛ Schools and Colleges Dasara & Sankranti Festivals Holidays 2024 : ఈ సారి భారీగా స్కూల్స్‌, కాలేజీల‌కు దసరా, సంక్రాంతి సెల‌వులు ప్రకటించిన ప్రభుత్వం.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ఆగ‌స్టు 21వ తేదీన భారత్ బంద్..

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొందరు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బహుజన సంఘాల్లో తీవ్ర వ్యతిరేత వ్యక్తం అవుతోంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, రిజర్వేషన్ కేటగిరీలలో ఉపవర్గీకరణలను అనుమతిస్తూ ఈమధ్యే సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. ఈ రెండు వర్గాల్లో ఉపవర్గీకరణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు నిరసనగా ఆగ‌స్టు 21వ తేదీన (బుధ‌వారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎస్సీ, ఎస్టీ వర్గకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా వ్యతిరేకించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలను మొదలవుతున్నాయి.

మరో రోజు సెలవు ఇలా..
భీమ్ సేన, ట్రైబల్ ఆర్మీ చీఫ్ బంద్‌ పిలుపునకు పలు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ తీర్పు ఎస్సీ, ఎస్టీల్లోని ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని మండిపడుతున్నాయి. దీంతో ఆగ‌స్టు 21వ తేదీ(బుధ‌వారం) దేశంలోని అన్ని పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు సెలవు ప్రకటించే అవ‌కాశం ఉంది. దీంతో విద్యార్థులకు ఈ నెలలో అదనంగా మరో రోజు సెలవు జత కానుంది.

ఈ నెల‌లో మొత్తం ఆగ‌స్టు 4, 11, 18, 25 తేదీలు నాలుగు ఆదివారాలు రానున్నాయి. అలాగే ఆగ‌స్టు 10వ తేదీ రెండో శ‌నివారం, ఆగ‌స్టు 24వ తేదీన నాలుగో శ‌నివారం రానున్నాయి. మొత్తం మీద సాధార‌ణ సెల‌వులు 6 రోజులు స్కూల్స్ ,కాలేజీల‌కు సెల‌వులు రానున్నాయి.

ఆగస్టు 9వ తేదీన సెలవు..?
ఆగస్టు 9వ తేదీన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆ రోజున‌ సెలవు ప్రకటించే అవ‌కాశం ఉంది. ప్రపంచ దేశాలు, కొన్ని ఆదివాసీ రాష్ట్రాలు ఇప్ప‌టికే ఆగస్టు 9వ తేదీన‌ సెలవు ప్రకటించాయి. ఆ రోజున ఆదివాసీలకు సంబంధించిన సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలు చర్చించుకోవడానికి వారు అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణలోనూ ఆగ‌స్టు 9వ తేదీన‌ సెలవు ఇవ్వాల‌ని మంత్రి సీత‌క్క సీఎంకు విజ్ఞప్తి చేశారు.

ఆగ‌స్టు 15, 19, 26 తేదీల్లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు..?
15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా అన్ని స్కూల్స్ ,కాలేజీలు, ఆఫీసుల‌కు సెల‌వులు ఉంటుంది. అలాగే ఆగ‌స్టు 19వ తేదీన (సోమ‌వారం) రాఖీ పండ‌గ (Raksha Bandhan) సంద‌ర్భంగా స్కూల్స్‌, కాలేజీలు సెలవు ఉండే అవ‌కాశం ఉంటుంది. 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి పండ‌గ‌. ఈ రోజులు కూడా అన్ని స్కూల్స్ ,కాలేజీలు సెల‌వులు ఉంటుంది. దాదాపు 2024 ఆగ‌స్టు నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు 10 రోజులు వ‌ర‌కు సెల‌వులు రానున్నాయి. అలాగే ఏమైన బంద్‌లు, భారీ వ‌ర్షాల వ‌ల్ల స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

2024లో Schools & Colleges సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే..

➤☛ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.

#Tags