Dr BR Ambedkar Gurukul School : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల ప్రతిభా పాఠశాలలో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప‌లు తరగతుల్లో ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ వివ‌రించారు..

మధురవాడ: కొమ్మాది రిక్షా కాలనీలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల ప్రతిభా పాఠశాల (సీవోఈ)లో మిగుల సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ టి. నాగమణి చెప్పారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 7, 8, 9 తరగతుల్లో ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. 26వ తేదీ ఉదయం 10 గంటలు నుంచి సాయంత్రం 4 గంటలు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

TS Mega DSC 2024 Demand : 25000 ఉద్యోగాల‌తో మెగా డీఎస్సీకి నోటిఫికేష‌న్ ఇవ్వాలి.. లేదంటే..!

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆధార్‌ కార్డు, కులం, ఆదాయం, స్టడీ సర్టిఫికేట్‌ జత చేస్తూ దరఖాస్తు చేయాలన్నారు. 28వ తేదీ ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. కొమ్మాది జంక్షన్‌ సమీపంలోని రిక్షా కాలనీలో గల గాయత్రి మహిళా ఇంజినీరింగ్‌ కళాశాల వెనుక గల బాలికల గురుకుల ప్రతిభా పాఠశాలకు చేరుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 94927 85400, 83286 57824లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ నాగమణి కోరారు.

Govt Schools Admissions : ప్ర‌భుత్వ బ‌డుల్లో ప్ర‌వేశాల‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు.. నూరు శాతం ఎన్రోల్మెంట్‌కు కృషి!

#Tags