Good News For School And College Students : స్కూల్ విద్యార్థుల‌కు భారీ గుడ్‌న్యూస్‌.. ప్ర‌తి విద్యార్థికి నెలకు రూ.1000/- అర్హులు వీరే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌స్తుతం ప్ర‌భుత్వాలు స్కూల్స్‌, కాలేజీల పిల్ల‌ల‌కు అత్యంత ప్రాదాన్య‌త ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు మంచి మంచి పథకాలు ఉన్న విష‌యం తెల్సిందే.

ఇప్పుడు తాజాగా ఏపీలో నూత‌న ప్ర‌భుత్వం తల్లికి వందనం పేరుతో ఒక్కో విద్యార్థికీ సంవత్సరానికి రూ.15,000 ఇవ్వాల్సి ఉంది. ఆ లెక్కన నెలకు రూ.1,250 ఇస్తున్న‌ట్టు. ఈ పథకాన్ని ఇంకా ప్రారంభించలేదు. ఈ ప‌థ‌కం అమ‌లు అవుతుంతో లేదో అనుమాన‌మే. దీనికి కూడా కేవ‌లం ప్ర‌భుత్వ స్కూల్స్‌లో చ‌దివే వారికి మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంది.

☛ July 27, 28th Holidays : జూలై 27వ తేదీన‌ సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కార‌ణం ఇదే..

గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి రూ.13,000 ఇచ్చింది. ఇది క‌శ్చితంగా అమ‌లు చేసి నిరూపించింది. అలాగే గ‌త వైసీపీ  ప్ర‌భుత్వం, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల‌కు కూడా ఇచ్చింది. ఏపీ కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంత మంది విద్యార్థులుంటే.., అంతమందికీ ఇస్తామని చెప్పింది. అందువల్ల ఈ పథకం కోసం ల‌క్షాలాది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. మ‌ళ్లీ ఇప్పుడే ఏమో.. కేవ‌లం ప్ర‌భుత్వ స్కూల్స్‌లో చ‌దివే విద్యార్థుల‌కు మాత్ర‌మే రూ.15000 ఇస్తాం అంటున్నారు.

ఆ విద్యార్థులకు భారీ శుభవార్త.. నెలకు రూ.1000

ఇప్పుడు తాజా మ‌రో రాష్ట్ర‌ ప్ర‌భుత్వం సంచ‌న‌ల నిర్ణ‌యం తీసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హైస్కూల్ విద్యార్థులకు భారీ శుభవార్త చెప్పారు. హైస్కూల్ చదివే విద్యార్థులకు నెలకు రూ.1000 ఇస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈ పథకం పేరు 'తమిళ్ పుదల్వాన్' పథకం . దీన్ని ఆగస్టు నుంచి ప్రారంభిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు.

అర్హులు వీరే..

6వ త‌ర‌గ‌తి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులు ఈ ప‌థ‌కంకు అర్హులు. ఎట్ట‌కేల‌కు  తమిళనాడు ప్రభుత్వం కూడా ఓ అడుగు ముందుకేసి.. విద్యార్థులకు మేచ్చే ఓ పథకాన్ని ప్రకటించింది. తమిళ్ పుదల్వాన్ పథకం పంచాయతీ యూనియన్, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు, అది ద్రావిడర్ సంక్షేమ పాఠశాలలు, మున్సిపల్ స్కూళ్లు, కార్పొరేషన్ స్కూళ్లు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, కల్లార్ పునరుద్ధరణ స్కూల్స్‌తో పాటు వెనకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలలు, అటవీ పాఠశాలలు, సామాజిక భద్రతా విభాగం స్కూల్స్‌లో చదివే విద్యార్థులకు వర్తిస్తుంది.డిప్లొమా, డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేషన్, వొకేషనల్, పారామెడికల్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు స్టైపెండ్ ఇస్తారు. డిస్టెన్స్ లేదా ఓపెన్ యూనివర్శిటీలో చేరే విద్యార్థులకు ఈ పథకం వర్తించదు.

☛ Good News For Womens : మహిళలకు శుభవార్త.. ఇక ప్రతి నెలా అకౌంట్లలోకి రూ.2,500.. అర్హ‌త‌లు ఇవే..!

#Tags