TSPSC AEE Selected Candidates List Released: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(AEE)పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి 2022, సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వెలువడగా దాదాపు రెండేళ్ల తర్వాత ఫలితాలు వెలువడ్డాయి.
ఏఈఈ పోస్టులకు మే 9న పరీక్ష నిర్వహించగా, ఈ ఏడాది మార్చి 18న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. తాజాగా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేశారు. అభ్యర్థులు వారి హాల్‌టికెట్ నెంబర్లను TSPSC అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
#Tags