SK University Degree Results 2023: ఎస్కేయూ డిగ్రీ మూడో సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన డిగ్రీ మూడో సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ ఫలితాలను ఎస్కేయూ వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి జులై 20 గురువారం విడుదల చేశారు. బీఎస్సీలో 5,020 మంది పరీక్షలకు హాజరు కాగా 55.14 శాతంతో 2,768 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే బీఏలో 1,123 మందికి గాను 333 (29.65 శాతం) మంది, బీకామ్‌లో 5,442 మందికి గాను 1,888 (34.69శాతం) మంది, బీసీఏలో 33 మందికి గాను 16 (48.48 శాతం) మంది, బీబీఏలో 972 మందికి గాను 400 (41.15 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యుయేషన్‌, పర్సనల్‌ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 4వ తేదీ వరకు గడువునిచ్చారు. ఒక్కో పేపరుకు రూ.500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఎంవీ లక్ష్మయ్య, ప్రొఫెసర్‌ శోభలత, ప్రొఫెసర్‌ జీవన్‌కుమార్‌, డాక్టర్‌ పి.శంకరయ్య, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ జీవీ రమణ, డాక్టర్‌ వీ రఘునాథ్‌రెడ్డి, డాక్టర్‌ మురళీధర్‌, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ కే.శ్రీరాములు నాయక్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ చండ్రాయుడు తదితరులు పాల్గొన్నారు.

​​​​​​​SLPRB AP: ఎస్‌ఐ అభ్యర్థులు స్టేజ్‌–2 దరఖాస్తు సమర్పించాలి.. వీరిని మాత్రం ఈ పరీక్షలకు అనుమతించబోం

#Tags