NRSC Recruitment 2024: ఎన్‌ఆర్‌ఎస్‌సీలో సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా‌..

దేశాభివృద్ధిలో అంతరిక్ష పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుంది. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం, వాటిని పర్యవేక్షించడం తదితర ముఖ్య విధులను ఇస్రోలో పనిచేసే సైంటిస్ట్‌/ఇంజనీర్లు నిర్వహిస్తారు. తాజాగా ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌ఎస్‌సీ) పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 41
సైంటిస్ట్‌: వ్యవసాయం, ఫారెస్ట్రీ, ఎకాలజీ, జియోఇన్ఫర్మేటిక్స్, జియాలజీ, జియోఫిజిక్స్, సాయిల్‌సైన్స్, అర్బన్‌ స్టడీస్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీచేస్తారు. ఇందులో సైంటిస్ట్‌ ఇంజనీర్‌–35, మెడికల్‌ ఆఫీసర్‌–01, నర్స్‌–02, లైబ్రరీ అసిస్టెంట్‌–03 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు

  • పోస్టులను అనుసరించి విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. సైంటిస్ట్‌/ఇంజనీర్‌ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు ఎమ్మెస్సీ, ఎంఈ/ఎంటెక్, బీఎస్సీ/బీఈ/బీటెక్‌ పూర్తిచేసి ఉండాలి.
  • మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. అలాగే రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
  • నర్స్‌(బి) ఈ పోస్టులకు ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణతతో పాటు జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీలో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. 
  • లైబ్రరీ అసిస్టెంట్‌(ఎ) పోస్టులకు ప్రథమ శ్రేణి గ్రాడ్యుయేషన్‌తోపాటు ప్రథమ శ్రేణిలో మాస్టర్‌ డిగ్రీ ఇన్‌ లైబ్రరీ సైన్స్‌/లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

ఎంపిక ఇలా

  • పోస్టులను బట్టి ఎంపిక విధానం వేర్వేరుగా ఉంటుంది. సైంటిస్ట్‌/ఇంజనీరింగ్‌ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
  • మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
  • నర్స్‌ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌లను నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • లైబ్రరీ అసిస్టెంట్‌ పోస్టులకు రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ల్లో చూపించిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యసమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ:12.02.2024
వెబ్‌సైట్‌: https://www.nrsc.gov.in/

చదవండి: IIT Recruitment 2024: ఐఐటీలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోలు.. నెలకు రూ.31,000 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags