Good News For 10th Pass Candidates : గుడ్‌న్యూస్‌.. ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌లోనే 50000 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. త్వ‌ర‌లోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే.. గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన త్వరలో వెలువడనుంది.

ఇండియన్ పోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న సర్కిలలో దాదాపు 50 వేల గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ సిద్ధం చేసింది. ఈ ఉద్యోగాల‌కు ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కులు.., రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాల‌కు వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే రిజర్వేషన్ ఆధారంగా వయోపరిమితి సడలింపు కలదు. గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

☛ RRB ALP Vacancy Increased: శుభవార్త‌.. భారీగా పెరిగిన అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులు..

వీరి జీతం ఇలా..
వీరికి వేతనం ప్రారంభంలో 10వేల రూపాయల నుంచి 12 వేల రూపాయల మధ్య ఉంటుంది. పదోన్నతులు ద్వారా ఉన్నత స్థానాలకు చేరవచ్చు. ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు సర్వీసులు ద్వారా ఇన్సెంటివ్‌లు పొందవచ్చు. గతేడాది ఈ పోస్టుల భర్తీ కోసం 40,889 ఖాళీలను భర్తీ చేశారు. ఈ ఏడాది 50 వేలకు పైచీలుకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. 

 Railway Jobs: 2024లో రైల్వేలో భారీ ఉద్యోగాలు.. జాబ్‌ క్యాలెండర్‌ ఇదే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తింపు.. 
ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త ఉన్న‌ అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. తమ ప్రాంతానికి చుట్టు పక్కల ఉన్న పోస్ట్ ఆఫీస్‌లలో పని చేయటానికి ఆప్షన్లు పెట్టుకోవలసి ఉంటుంది. మెరిట్ ఆధారంగా దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్‌ల్లో పోస్టింగ్ ఇస్తారు. పోస్టల్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ శాఖ.. కావున ఇందులో పనిచేసే ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న త‌ర్వాత‌ పదో తరగతిలో సాధించిన మార్కులు.., రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా దశలవారీగా ఫలితాలను వెల్లడి చేస్తుంటారు. కావున ఎప్పటికప్పుడు https://indiapostgdsonline.gov.in/ ఈ వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.

☛ TS Government Job Calendar 2024 Release : తెలంగాణ‌లో జాబ్ క్యాలెండర్-2024 విడుద‌ల.. ఎప్పుడంటే..? పోస్టుల వివ‌రాలు ఇవే..

#Tags