TS PGECET 2024 Results Link : పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల.. ఒకేఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో రిజల్ట్స్‌

తెలంగాణలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (TS PGECET)- 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. నేడు(మంగళవారం) సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు ఫలితాలను రిలీజ్‌ చేశారు. అభ్యర్థులు డైరెక్ట్‌ లింక్స్‌ https://results.sakshieducation.com లేదా www.sakshieducation.com  క్లిక్‌ చేసి ఫలితాలను నేరుగా చెక్‌ చేసుకోవచ్చు. 

☛ TS PGECET 2024 Results కోసం క్లిక్ చేయండి

కాగా మే 29 నుంచి జూన్‌ 1 వరకు ప్రవేశ పరీక్ష సీబీటీ విధానంలో పీజీఈసెట్‌ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. 2024-25 విద్యా సంవత్సరంలో యూనివర్సిటీలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌/ఫార్మసీ/ఆర్కిటెక్చర్‌ కాలేజీల్లో ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక్‌, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీఈసెట్‌ను నిర్వహిస్తారు. 

 TS PGECET 2024 Results.. ఇలా చెక్‌ చేసుకోండి

  • ముందుగా  results.sakshieducation.com లేదా www.sakshieducation.com ను క్లిక్‌ చేయండి
  • హోం పేజీలో కనిపిస్తున్న TSPGECET 2024 results అనే లింక్‌పై క్లిక్‌ చేయండి. 
  • తర్వాతి పేజీలో మీ హాల్‌టికెట్‌ నెంబర్‌ వివరలను ఎంటర్‌ చేయండి
  • స్క్రీన్‌పై మీకు మార్కుల వివరాలతో పాటు ర్యాంకు డిస్‌ప్లే అవుతుంది. 
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి.

AP Inter Supplementary Results Released: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 87 శాతం ఉత్తీర్ణత, ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ తెలుసుకోండిలా..

#Tags