NEET PG 2024: పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశాలకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌)-2024 పరీక్ష... పరీక్ష తేదీ ఎప్పుడంటే..

న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌).. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ)లో ప్రవేశాలకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌)-2024 పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా ఎండీ/ఎంఎస్‌/పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హత: ఎంబీబీఎస్‌ డిగ్రీ/ప్రొవిజనల్‌ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి.

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటల 30 నిమిషాలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.05.2024
పరీక్ష తేది: 23.06.2024.
ఫలితాల వెల్లడి: 15.07.2024.

వెబ్‌సైట్‌: https://natboard.edu.in/

చదవండి: IISER Admissions 2024: IAT 2024తో ప్రవేశం కల్పించే క్యాంపస్‌లు-కోర్సులు.. పరీక్ష విధానం, బెస్ట్‌ స్కోర్‌కు మార్గాలివే..

#Tags