Masters in NIPER Campus: జేఈఈ ద్వారా ఎన్‌ఐపీఈఆర్‌ క్యాంపస్‌లో మాస్టర్స్‌కు దరఖాస్తులు..

జేఈఈ 2024తో మాస్టర్స్‌లో ప్రవేశాలు ఇలా..

గువాహటిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (నైపర్‌).. జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ)–2024 ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న (ఎన్‌ఐపీఈఆర్‌) క్యాంపస్‌లలో మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

»    నైపర్‌ క్యాంపస్‌లు: అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, హైదరాబాద్, కోల్‌కతా, రాయ్‌బరేలి, ఎస్‌ఏఎస్‌ నగర్‌.
»    మొత్తం సీట్ల సంఖ్య: 990
»    కోర్సుల వివరాలు: మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌(ఫార్మసీ), మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఫార్మసీ), 
మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఫార్మసీ).
»    అర్హత: బీఫార్మసీ/ఎంఎస్సీ/బీఈ, బీటెక్‌/ఎంబీబీఎస్‌/బీవీఎస్సీ/బీడీఎస్‌తో పాటు జీప్యాట్‌/గేట్‌/నెట్‌/ఇతర జాతీయ ఫెలోషిప్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
»    ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, కౌన్సిలింగ్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 25.04.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.05.2024
»    పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://niperguwahati.ac.in/niperjee

Civil Judge Posts: తెలంగాణలో సివిల్‌ జడ్జి పోస్టులకు దరఖాస్తులు..

#Tags