Scholarship : సీబీఎస్ఈ సింగ‌ల్ గ‌ర్ల్ చైల్డ్ స్కాల‌ర్‌షిప్‌ 2024.. అర్హ‌త వీరికే..

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ).. ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం స్కాలర్‌షిప్‌ని ప్రతీ సంవత్సరం అందిస్తోంది. 

»    అర్హత: విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. విద్యార్థిని సీబీఎస్‌ఈలో పదో తరగతి ఉత్తీర్ణురాలై,సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలో పదకొండు తరగతి, పన్నెండో తరగతి చదువుతూ ఉండాలి. పదో తరగతి పరీక్షలో కనీసం 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థిని ట్యూషన్‌ఫీజు నెలకు రూ.2500 కంటే మించకూడదు.
»    స్కాలర్‌షిప్‌: ఉపకారవేతనానికి ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్స­రం రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్‌ చేయించుకోవాలంటే.. విద్యార్థిని కనీసం 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థినులకు రెండేళ్లపాటు నెలకు రూ.1000 చొప్పున అందిస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.12.2024.
»    సీబీఎస్‌ఈ పాఠశాలల దరఖాస్తు ధ్రువీకరణ తేదీలు: 25.11.2024 నుంచి 24.12.2024. 
»    వెబ్‌సైట్‌: https://www.cbse.gov.in

 IDBI Bank Jobs : ఐడీబీఐ బ్యాంక్‌లో 600 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags