NEET Re-Exam Results2024 :నీట్‌ యూజీ 2024 సెంటర్లవారీగా ఫలితాలు విడుదల

NEET Re-Exam Results2024 :నీట్‌ యూజీ 2024 సెంటర్లవారీగా ఫలితాలు విడుదల

ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్-యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (NTA) విడుదల చేసింది. నగరాలు, కేంద్రాల వారీగా అందరి ఫలితాలను ఎన్‌టీఏ నీట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో శనివారం ఈ ఫలితాలను అప్‌లోడ్‌ చేసింది. అభ్యర్థులు nta.ac.in/NEET/ లేదా neet.ntaonline.in.  వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను నగరాలు, కేంద్రాల వారిగా చూసుకోవచ్చని ఎన్‌టీఏ పేర్కొంది.

నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జడ్జిలు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు నగరాల వారీగా, కేంద్రాల వారీగా అందరి ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించింది. మరోవైపు.. అభ్యర్థుల వివరాలు బహిర్గతం కాకుండా గుర్తింపుపై మాస్క్ వేసి ప్రచురించాలని సుప్రీంకోర్టు నీట్ కమిటీకి స్పష్టం చేసింది. 

ఇదీ చదవండి:  476 Vacancies in Indian Oil Corporation Limited

ఇక.. ఇలా ఫలితాలను విడుదల చేస్తే విద్యార్థుల వ్యక్తిగత వివరాలు బయటపడతాయని సొలిసిటర్ జనరల్ వాదించగా.. సీజేఐ చంద్రచూడ్‌ స్పందిస్తూ పరీక్ష కేంద్రాల వారీగా డమ్మీ రోల్‌ నంబర్లతో ఎందుకు ప్రకటించకూడదని ప్రశ్నించారు.

#Tags