MBBS and BDS Medical Seats 2024 : విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక‌పై వీరికి ప్రభుత్వ, ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీల్లో 10% సీట్లు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : సాక్షి ఎడ్యుకేష‌న్ : విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌. ఇక‌పై అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు చేయ‌నున్నారు.

ఏపీలోని అన్ని  ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10% సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆగస్టు 6వ తేదీన (మంగ‌ళ‌వారం) ఉత్తర్వులు జారీ చేశారు.

➤ AP & TS NEET UG Cutoff Marks 2024 : ఏపీ, తెలంగాణ నీట్‌ యూజీ -2024 కటాఫ్‌ మార్కులు ఇవే.. కౌన్సెలింగ్ తేదీలు ఇవే..!

వీరికి వ‌ర్తించ‌దు..
ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధ గుర్తింపు కలిగిన అన్ని వైద్య కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10% సీట్లు భర్తీ చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. అయితే మైనారిటీ విద్యాసంస్థలు ఇది వ‌ర్తించ‌దు. ఎంబీబీఎస్, పీజీ, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. అలాగే సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇది వర్తించదని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వుల్లో తెలిపారు.

జాతీయ వైద్య కమిషన్‌..
ఇప్పటివరకు కొన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే ఈడబ్ల్యూఎస్‌ కింద సీట్లు భర్తీ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ కోటా కింద పూర్తిస్థాయిలో సీట్ల భర్తీ జరగాల్సిందేనని జాతీయ వైద్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది.

 MBBS Seats Increased 2024 : మెడిక‌ల్‌ కాలేజీల్లో 4,115కి పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు.. ఇకపై ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లుకు వీరికే..!

#Tags