NEET Counselling 2023: రాష్ట్ర పీజీ మెడికల్ కౌన్సెలింగ్ తేదీలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: ఆగష్టు 5వ తేదీ నుంచి మొదటి విడత రాష్ట్రస్థాయి కోటా మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డిప్లొమా, ఎండీఎస్, పీజీ డీఎన్‌బీ) సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.
జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) ఆదేశాల మేరకు ఆగస్టు 16 వరకు కౌన్సెలింగ్ జరుగనుంది. ఇందులో సీట్లు పొందినవారు 20, 21 తేదీల్లో చేరాలి. ఇక రెండో విడత కౌన్సెలింగ్ ఆగష్టు 25 నుంచి సెప్టెంబర్ 6 వరకు నిర్వహించనున్నారు. వాటిల్లో సీట్లు పొందినవారు సెప్టెంబర్ 11, 12వ తేదీల్లో చేరాలి. ఇక మూడో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 16 నుంచి 26వ వరకు జరగనుంది.
చదవండి: NEET Ranker: నీట్ ర్యాంకర్‌కు ఆర్థికసాయం
అందులో సీట్లు పొందినవారు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ మధ్య చేరాలి. స్ట్రే వేకెన్సీ (తుది విడత) కౌన్సెలింగ్ అక్టోబర్ 1 నుంచి పదో తేదీ వరకు జరుగుతుంది. అందులో సీట్లు పొందినవారు పదో తేదీనే చేరాల్సి ఉంటుంది. తరగతులు సెప్టెంబర్ 5 నుంచే జరుగుతాయని ఎన్‌ఎంసీ తెలిపింది.
#Tags