NEET UG 2024 Counselling: నీట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు.. తెలంగాణ, ఏపీకు ఎన్ని సీట్లంటే..
నీట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఎంబీబీఎస్‌లో 614 సీట్లు పెరిగాయి. నీట్ యూజీ- 2024 సెకండ్ రౌండ్ కౌన్సెలింగ్‌లో కొత్తగా ఆరు వందల సీట్లను పెంచుతూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆ వివరాలను అధికారిక వెబ్‌సైట్ mcc.nic.inలో అందుబాటులో ఉంచింది.
ఇక పెరిగిన సీట్లలో ఎక్కువగా తెలంగాణకే కేటాయించడం విశేషం. ప్రస్తుతం తెలంగాణలోని 8 కాలేజీల్లో అదనంగా 600 సీట్లను మంజూరు చేయగా, ఆంధ్రప్రదేశ్‌కు 7, మహారాష్ట్రకు 7 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించారు. కాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (UGC) నాలుగు కాలేజీలకు "డీమ్డ్ యూనివర్శిటీ" హోదాను మంజూరు చేసింది. ఆ కాలేజీల వివరాలు ఇవే..
డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందిన కాలేజీలు:
- మల్లా రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్: 200 ఎంబీబీఎస్ సీట్లు
- మల్లా రెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, హైదరాబాద్: 200 MBBS సీట్లు
- మల్లా రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, హైదరాబాద్: 100 బీడీఎస్ సీట్లు
- మల్లా రెడ్డి డెంటల్ కాలేజ్ ఫర్ ఉమెన్, హైదరాబాద్: 100 బీడీఎస్ సీట్లు
ఇదిలా ఉంటే తెలంగాణలో ఎంబీబీఎస్ రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌పై స్థానికత అంశంపై గందరగోళం నెలకొంది. ఎంబీబీఎస్ సహా ఇతర మెడికల్ కోర్సుల్లో స్థానికత నిర్ధారణకు ప్రభుత్వం ఈసారి మార్పులు చేసింది. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్ మధ్యలో ఏదైనా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వారిని స్థానికులుగా గుర్తించేది.
Navodaya Admissions: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు అర్హత, చివరి తేదీ ఇదే..
అయితే ఇప్పుడు 9, 10, ఇంటర్ రెండేళ్లు కలిపి మొత్తం నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదివిన వారినే స్థానికులుగా గుర్తించాలని ఉత్తర్వులు జారీచేసింది. దీంతో కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమకు అన్యాయం జరుగుతుందని కోర్టుకు వెళ్లారు.
వాస్తవానికి జాతీయ స్థాయిలో తొలివిడత కౌన్సెలింగ్ ముగిశాక రాష్ట్రస్థాయిలో తొలివిడత కౌన్సెలింగ్ నిర్వహించాలి. కానీ స్థానికత అంశం కోర్టులో ఉండటంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కౌన్సెలింగ్ మొదలవలేదు. దీంతో ఈసారి తెలంగాణలో ఈసారి కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కానుంది.