NEET-PG 2024 Postponed: పరీక్షకు కేవలం కొన్ని గంటల ముందు.. నీట్‌-పీజీ పరీక్ష వాయిదా, అయోమయంలో వైద్య విద్యార్థులు

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌-యూజీ పరీక్షపై ఓ వైపు దేశ వ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న వాళ నీట్‌-పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. నిన్న(జూన్‌23)న జరగాల్సిన ఈ పరీక్షను కొన్ని గంటల ముందు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో వైద్య విద్యార్థులను అయోమయంలో పడేసింది. దీంతో అప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు తిరిగి వెళ్లక తప్పలేదు.

 

CSIR UGC NET Exam 2024 Postponed: ఎన్టీఏ మరో కీలక ప్రకటన..సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ పరీక్ష వాయిదా, కారణమిదే!

అనివార్య కారణాలతో పరీక్షను వాయిదా వేసినట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. పరీక్ష తేదీని త్వరలోనే వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని వివరించింది. అయితే, పేపర్‌ లీకైందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీట్- పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు.

NEET-UG Re-Exam: ముగిసిన నీట్‌ రీ-ఎగ్జామ్‌.. సగం మంది అభ్యర్థులు డుమ్మా

అయితే నీట్‌-పీజీ ‍ప్రవేశ పరీక్ష ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. మొదట మార్చి 3న పరీక్ష నిర్వహించనున్నట్లు NTA అధికారిక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత దాన్ని జులై 7కు వాయిదా వేశారు. మళ్లీ ఏమైందో ఏమో కొన్ని రోజుల ముందుగానే జూన్‌ 23కి షెడ్యూల్‌ చేశారు. తాజాగా నీట్‌ పరీక్ష లీకేజీ వ్యవహారంలో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు చెలరేగుతుండటంతో మరోసారి పరీక్ష తేదీని మార్చారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. 
 

#Tags