Neet Paper Leak Updates: 'నీట్‌' పేపర్‌ లీకేజీ.. పరీక్షకు 48 గంటల ముందే అమ్మకం

న్యూఢిల్లీ : నీట్‌  పేపర్‌ లీకేజీలో తీగలాగితే డొంకంతా కదులుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన బీహార్‌కు చెందిన నలుగురు నీట్‌ అభ్యర్ధులు అనురాగ్‌ యాదవ్‌,శివానందన్‌, అభిషేక్‌, ఆయుష్‌రాజ్‌, ఇద్దరు లీకేజీ ముఠా సభ్యులు నితీష్‌, అమిత్‌ ఆనంద్‌తోపాటు  ప్రభుత్వ జూనియర్‌ ఇంజినీర్‌ సికిందర్‌ యాదవేందులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇప్పటికే నీట్‌  పేపర్‌ లీకేజీ నిజమేనని, ఒక్కో  నీట్‌ అభ్యర్ధి నుంచి రూ.40 లక్షలు, రూ. 32 లక్షలు వసూలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.తాజాగా, నీట్‌ ఎగ్జామ్‌ నిర్వహణకు 48 గంటల ముందే నీట్‌ పేపర్‌ను డార్క్‌ వెబ్‌, ఎన్‌క్రిప్ట్‌డ్‌ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫారమ్‌లో రూ.6 లక్షలకు అమ్మినట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. 

Good News For 10th Pass Candidates : గుడ్‌న్యూస్‌.. ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌లోనే 50000 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. త్వ‌ర‌లోనే..

అయితే పేపర్‌ లీకేజీతో విద్యా మంత్రిత్వ శాఖ పరీక్షను రద్దు చేసిందని సీబీఐ అధికారులు పలు జాతీయ మీడియా సంస్థలకు చెప్పినట్లు సమాచారం.ప్రస్తుతం, నీట్‌ పేపర్‌ లీకేజీ మూలాలు ఇంకా గుర్తించలేదు. వాటిని గుర్తించేందుకు సీబీఐ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లు రంగంలోకి దిగాయి. 

#Tags