NEET 2024 Supreme Court Live Updates: అప్పుడే నీట్‌ పరీక్షను రద్దు చేస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: నీట్ పేపర్‌ లీక్‌పై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ సందర్భంగా విచారణ కొనసాగిస్తున్న న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. నీట్‌ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై కీలక వ్యాఖ్యలు చేసింది. 

నీట్‌ అక్రమాలు, పేపర్‌ లీకేజీలపై సీబీఐ, కేంద్రం వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేశాయి. అందులో నీట్‌లో మాల్‌ ప్రాక్టీస్‌ జరగలేదని, బీహార్‌లోని పేపర్‌ లీక్‌ ఓ కేంద్రానికి మాత్రమే పరిమితమైందని, పేపర్‌ లీకేజీ సోషల్‌ మీడియాలో కాలేదని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లలో కేంద్రం పేర్కొంది.

NEET Paper Leak Case: నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో ముగ్గురు ఎయిమ్స్‌ వైద్యుల అరెస్ట్‌

ఇవాళ నీట్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మాట్లాడుతూ.. నీట్‌ పేపర్‌ లీకేజీ కొద్ది మొత్తంలో కాకుండా దేశం మొత్తం లీకైందని నిరూపించే ఆధారాలు ఉన్నాయా? ఉంటే కోర్టుకు అందించాలని విద్యార్ధులు, ఎన్‌టీఏ నుంచి మరిన్ని ఆధారాలు అందించాలని సూచించింది. పెద్ద మొత్తంలో లీకేజీ అయినట్లు తేలితే.. నీట్‌ పరీక్షను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విద్యార్ధుల హాజరుతో పాటు దాఖలైన పిటిషన్లు, రీ-నీట్‌ నిర్వహించాలని కోరుతున్నారనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని తెలిపింది. 

Job Opportunities: ఖాళీగా 18 లక్షల ఉద్యోగాలు.. కానీ అభ్యర్థులు కరువు

నీట్‌ పేపర్‌ లీకేజీపై దర్యాప్తు నివేదికను సీబీఐ సుప్రీం కోర్టుకు అందించింది. ఆ రిపోర్ట్‌ను బహిర్ఘతం చేస్తే దర్యాప్తుకు ఆటంకం కలిగే అవకాశం ఉందని తెలిపింది. లంచ్‌ బ్రేక్‌ తర్వాత అత్యున్నత న్యాయ స్థానంలో నీట్‌పై విచారణ కొనసాగనుంది.  

#Tags