Free JEE & NEET Coaching: జేఈఈ, నీట్ ఆన్‌లైన్ ఉచిత శిక్షణ
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు ఐఐటీ, నీట్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఈ ఆన్‌లైన్ బోధన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి, వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలోని కస్తూర్భా గాంధీ విద్యా లయాల్లో (కేజీబీవీ)జనవరి 9న జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్ బోధనను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి శ్రీనివాస్ ప్రారంభించారు.
చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిపారు.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | వీడియోస్
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ ఢిల్లీ, హైదరాబాద్, రాజస్తాన్‌లోని కోటాలో అందుబాటులో ఉన్న జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్ విద్యాబోధనను జిల్లాలోని కేజీబీవీలలో ప్రారంభించినట్లు వెల్లడించారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని, బియ్యం, పప్పుల్లో పురుగులు లేకుండా చూడాలని ఆదేశించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |